Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా గాయాల పాలైతే ఇక అంతేనా??

 Are injured Indian cricketers avoiding NCA?

న్యూఢిల్లీ: ఏటా వృద్ధి సాధిస్తోన్న బీసీసీఐ.. సరికొత్త ప్రతిపాదనలతో రోజురోజుకూ రూపాంతరం చెందుతోంది. ఆశించిన దానికంటే ఎక్కువగా ఖ్యాతి పొందిన ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) బీసీసీఐకి కాసుల వర్షం కురిపిస్తోంది. మీడియా ప్రసారాల ద్వారా పలు రకాలుగా సంపాదిస్తోన్న బీసీసీఐ ఎందుకో ఆ నిర్లక్ష్యం వహిస్తోంది. స్టేడియంలో క్రికెట్ ఆడుతూ గాయాలపాలైన వారికి సరైన న్యాయం చేయలేకపోతోంది. ఈ క్రమంలో నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరే వారే లేకుండాపోయారు.

 రిపోర్టులకు సమాధానం వహించేదెవరు

రిపోర్టులకు సమాధానం వహించేదెవరు

గాయాలపాలై అకాడమీలో చేరిన వారికి చికిత్స తీసుకునేవారెవరు? చికిత్స నిమిత్తం వారు తీసుకున్న రిపోర్టులకు సమాధానం వహించేదెవరు? వీటన్నిటిపై టైమ్స్ ఆఫ్ ఇండియా ప్రత్యేక రిపోర్టు చేసింది. బెంగళూరు వేదికగా ఏదో ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స్ తీసుకుంటున్నట్లుగా సమాచారం అందుతోంది. ఎందుకంటే క్రికెటర్లకు నేషనల్ క్రికెట్‌లో అకాడమీలో చికిత్స తీసుకుంటే కోలుకుంటామనే నమ్మకం లేకపోవడమే ప్రధాన కారణమంటూ చెప్పుకొంటున్నారు.

చికిత్స పూర్తవకుండానే వెళ్లిపోయాడు

చికిత్స పూర్తవకుండానే వెళ్లిపోయాడు

ఇటీవల ఓ భారత్ ఏ జట్టు క్రికెటర్ గాయాలపాలై నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరాడు. కొద్ది కాలం తర్వాత రాహుల్ ద్రవిడ్‌ను కలిసి ఇంకా చికిత్స పూర్తవకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత సదరు క్రికెటర్ తాను ప్రాతినిధ్యం వహిస్తోన్న ఐపీఎల్ జట్టు యాజమాన్యం నుంచి సహాయం అందుకుని చికిత్స పూర్తి చేయించుకున్నాడు. ఈ క్రమంలో టీమిండియా ఆటగాళ్లు ఎవరికి వారు తమ సొంత వైద్యులను నియమించుకుంటున్నారు. నెలల తరబడి తాము ప్రయాణిస్తున్న ప్రాంతాలలో అందుబాటులో ఉండేందుకు వైద్యుల్ని తీసుకుపోతున్నారట టీమిండియా క్రికెటర్లు.

వృద్ధిమాన్ సాహా ఎంపిక కాలేకపోవడానికి కారణం..

వృద్ధిమాన్ సాహా ఎంపిక కాలేకపోవడానికి కారణం..

కొన్నాళ్ల కిందట గాయపడ్డ వృద్ధిమాన్ సాహా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లేందుకు కూడా జట్టులో ఎంపిక కాలేదు. కారణం.. నేషనల్ క్రికెట్ అకాడమీలో చేరి చికిత్స తీసుకోవడమేనని కూడా అంటున్నారు విమర్శకులు. అతను గాయంతో బాధపడుతుండగానే టీమిండియా ఎన్నో సిరీస్‌లను విజయాలను సాధిస్తోంది. ప్రతి సిరీస్ ఆరంభంలో సాహా ఆరోగ్య పరిస్థితి కనుక్కోవడం.. ఇంకా కోలుకోలేదని పెదవి విరిచేయడం పట్ల అతని క్రీడా భవిష్యత్‌పై కూడా పడనుంది.

బీసీసీఐ.. ఎందుకని పట్టించుకోవడం

బీసీసీఐ.. ఎందుకని పట్టించుకోవడం

ఇన్ని రకాలుగా లాభాలు వచ్చిపడుతున్నప్పటికీ బీసీసీఐ.. నేషనల్ క్రికెట్ అకాడమీని ఎందుకని పట్టించుకోవడం లేదో.. అర్థం కాని ప్రశ్నగానే మిగిలింది. పీసీబీ బోర్డుతో వివాదాలకు తదుపరి సిరీస్‌లకు తగిన జట్టు ఎంపిక చేయకపోవడం వంటి విషయాలపై కాలయాపన చేస్తుంది. కానీ, ఇలాంటి వాటి గురించి ఏమైనా చర్య తీసుకుంటుందా అనేది సందిగ్ధం.

Story first published: Monday, October 1, 2018, 19:19 [IST]
Other articles published on Oct 1, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+