చెన్నై: క్రికెట్ దేవుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శనివారం తమిళనాడు రాజధాని చెన్నైలో సందడి చేశారు. ఓ ట్రస్ట్‌కు చెందిన కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు చెన్నై వెళ్లిన సచిన్.
ఆ తర్వాత నేరుగా కోడంబాక్కంలోని ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ ఇంటికి వెళ్లారు.

తనకు మిత్రుడైన రెహమాన్‌తో కొద్దిసేపు ముచ్చటించిన సచిన్.. సంగీతం రూపకల్పన, పాటలకు బాణీలు కట్టే తీరుపై రెహమాన్‌కు సరదా ప్రశ్నలు సంధించారు.
దీంతో అక్కడికక్కడే కొన్ని బాణీలు కట్టిన రెహమాన్ తన మిత్రుడి కోరిక తీర్చారు. అతని కోసం కొన్ని కొత్త ట్యూన్స్‌ను వినిపించారు.