హైదరాబాద్: డొనాల్డ్ ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్ష పదవి రేసులో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఉన్నట్లు న్యూయర్క్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని శనివారం తన ట్విట్టర్ ద్వారా అభిమానులకు పంచుకున్న సెహ్వాగ్ హ్యాపీ 'ఏప్రిల్ ఫూల్స్ డే' అని చెప్పారు.
ప్రముఖ ఇంగ్లీషు జర్నలిస్ట్ స్టీఫెన్ స్మిత్ ఈ కథనాన్ని రాశారు. సెహ్వాగ్ ట్విట్టర్‌లో షేర్ చేసిన కథనంలో తరచూ అమెరికా వస్తున్న సెహ్వాగ్‌తో అమెరికా ప్రభుత్వం రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటోందని ఉంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాలు ఇద్దరూ కలిసి సెహ్వాగ్‌ను అమెరికా అధ్యక్ష పదవికి ఏకగ్రీవంగా ఎంపిక చేయనున్నారని ఆర్టికల్‌లో స్టీఫెన్ పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ఈ ఏడాది అమెరికా పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ వెళ్లిన సమయంలో ఇరువురూ మోడీతో ఈ అంశంపై చర్చిస్తారని స్టీఫెన్ అందులో పేర్కొన్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత సెహ్వాగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్నారు.