రషీద్.. నా బాయ్‌ఫ్రెండ్‌కి చూసి బౌలింగ్ వెయ్!!

న్యూఢిల్లీ: అఫ్గాన్ సంచలనం.. రషీద్ ఖాన్. ప్రస్తుత అఫ్గనిస్తాన్ జట్టులో ప్రధాన బౌలర్‌గా మారి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇటీవల ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో వరల్డ్ నం.2 ర్యాంకు పొందాడు. ఆసియా కప్‌లో వన్డే ఫార్మాట్‌లలో ప్రదర్శన ఆధారంగా కేటాయించింది ఐసీసీ. అయితే ఈ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు రషీద్ ఖాన్. దానికి స్పందించిన ఆస్ట్రేలియా యాంకర్.. మోడల్ ఎరిన్ హోల్లాండ్ కృతజ్ఞతలు తెలిపింది. అంతేకాదు, దాంతో పాటుగా తన బాయ్ ఫ్రెండ్ బెన్ కటింగ్‌కు చూసి బౌలింగ్ వేయమని కోరింది.

వరల్డ్ నంబర్2 ర్యాంకింగ్ గురించి పోస్టు
ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో రషీద్‌తో పాటు ఆడిన బెన్ కటింగ్.. ఎరిన్ హోల్లాండ్ బాయ్ ఫ్రెండ్. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆటగాడైన కట్టింగ్ .. త్వరలో ఆరంభం కానున్న అఫ్గనిస్తాన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడనున్నాడు. అయితే ఈ లీగ్‌లో బెన్ నాంగారార్ లియోపార్డ్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఈ క్రమంలో రషీద్ ఖాన్ తాను సాధించిన వరల్డ్ నంబర్2 ర్యాంకింగ్ గురించి చేసిన పోస్టుకు ఎరిన్ హోల్లాండ్ బదులిచ్చింది.
నా కోసం బెన్ కట్టింగ్‌ని వదిలిపెట్టు
'రషీద్.. నువ్వు ఇది సాధించడం చాలా ఆనందంగా ఉంది. నా కోసం బెన్ కట్టింగ్‌ని వదిలిపెట్టు. అతనికి చూసి బౌలింగ్ వెయ్యి. అఫ్గాన్ ప్రీమియర్ లీగ్‌లో దారుణంగా బౌలింగ్ వేయకు.' అని తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్టు చేసింది. దానికి స్పందించిన రషీద్ 'శుభాకాంక్షలు తెలిపినందుకు కృతజ్ఞతలు. అలాగే చూసి బౌలింగ్ వేస్తాను. కానీ, నువ్వు కూడా చెప్పు. నా బౌలింగ్‌లో పరుగులు చెయ్యెద్దు' అని రషీద్ చమత్కరిస్తూ బదులిచ్చాడు.

స్టార్ క్రికెటర్లందరినీ ఈ లీగ్‌కు హాజరుకావాల్సిందిగా
లీగ్‌కు సంబంధించి అందుబాటులో ఉన్న స్టార్ క్రికెటర్లందరినీ ఈ లీగ్‌కు హాజరుకావాల్సిందిగా కోరింది అఫ్గాన్ ప్రీమియర్ లీగ్ మేనేజ్‌మెంట్. క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, ముష్‌ఫికర్ రహీం, షాహిద్ అఫ్రీది, బ్రెండన్ మెక్ కల్లమ్, కొల్లిన్ మున్రో, తీసరా పెరీరాలతో పాటు మరికొందరిని లీగ్ లో ఆడాల్సిందిగా ఆహ్వానించింది ఆర్గనైజేషన్. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో మూడు గేమ్‌లలో పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియాలతో ఓడిపోయిన అఫ్గాన్‌కు ఈ లీగ్ ద్వారా ఆటలో మరింత మెరుగయ్యేందుకు ఉపయోగపడనుంది.

దేశీవాలీ లీగ్‌లు పెట్టి ఆటతీరును..
ఇప్పటికే పలు దేశాలు దేశీవాలీ లీగ్‌లు పెట్టి తమ ఆటతీరును సంపాదనను పెంచుకున్నాయి. ఇప్పుడు అదే కోవలో చేరేందుకు అఫ్గనిస్తాన్ ప్రయత్నిస్తోంది. ఈ టోర్నమెంట్ రషీద్ ఖాన్, మొహమ్మద్ నబీ, అస్గర్ అఫ్గాన్, మొహమ్మద్ షాహ్జాద్‌లకు చక్కని అవకాశంగా మారనుంది. వచ్చే ఏడాది జరగనున్న ప్రపంచ కప్‌లో నాకౌట్ దశలో పోటీపడేందుకు పాకిస్తాన్, శ్రీలంక, వెస్టిండీస్‌లకు ధీటుగా సిద్ధమవుతోంది అఫ్గనిస్తాన్.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications