For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అంధ క్రికెటర్ల వేదనకు చలించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. తనను కలిసేందుకు వచ్చి తమ బాధలను చెప్పుకునే వారి మాటలను సావధానంగా వినే పవన్ కల్యాణ్.. ఆ సమస్యల పరిష్కారానికి వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ విషయం అంధ క్రికెటర్ల విషయంలో మరోసారి నిరూపితం అయింది. ప్రపంచ కప్ గెలిచిన భారత అంధ మహిళల జట్టు సభ్యులు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను ఈ నెల 12న కలిశారు. ఈ క్రమంలో వారిని అభినందించిన పవన్ కల్యాణ్.. వరల్డ్ కప్ గెలిచిన ఆ జట్టుకు 84 లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని వ్యక్తిగత సంపాదన నుంచి అందించడం గమనార్హం. క్రీడాకారిణులకు ఒక్కొక్కరికి రూ.5 లక్షలకు, కోచ్‌లకు రూ.2 లక్షల చొప్పు అందించారు.

మధ్యాహ్నం మాటిచ్చారు.. సాయంత్రానికి రోడ్లు మంజూరు చేశారు
డిసెంబర్ 12వ తేదీ ఉదయం ప్రపంచకప్‌ గెలిచిన అంధ మహిళా క్రికెట్ జట్టును పవన్ కల్యాణ్ అభినందించారు. ఈ సందర్భంగా టీమ్ కెప్టెన్ దీపిక తమ స్వగ్రామమైన శ్రీసత్యసాయి జిల్లాలోని తంబలహట్టి తండాకు సరైన రోడ్డు లేక తాము పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.కెప్టెన్ దీపిక వేదన విన్న పవన్ కల్యాణ్ తక్షణమే స్పందించారు. అదే రోజు సాయంత్రానికి రోడ్డు నిర్మాణానికి అనుమతులు ఇచ్చేలా చర్యలు చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. ఆయన ఆదేశాలతో కదిలిన అధికారులు హేమవతి పంచాయతీ పరిధిలో ఉన్న రోడ్లను పరిశీలించి అంచనాలు రూపొందించారు.

AP Deputy CM Pawan Kalyan Compassionate Support to Blind Women Cricketers

*రూ. 3.2 కోట్లతో హేమవతికి వెళ్లే రహదారి నిర్మాణానికి అనుమతి.

*రూ. 3 కోట్లతో గున్నేహళ్లికి వెళ్లే రోడ్డు నిర్మాణానికి అనుమతి.

ఈ రెండు రోడ్ల నిర్మాణానికి సంబంధించిన పాలనాపరమైన అనుమతులను పవన్ కల్యాణ్ ఆదేశాల మేరకు శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ మంజూరు చేశారు.

24 గంటల్లో అంధ క్రికెటర్ల ఇళ్లలో వస్తు కాంతులు
మ్యాచ్ ఫీజుతో కుటుంబ సభ్యుల ఆకలి తీరుస్తున్నామని జట్టు కెప్టెన్ దీపిక చెప్పిన మాటలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చలించిపోయారు. కెప్టెన్ దీపిక, జట్టు సభ్యురాలు పాంగి కరుణ కుమారి కుటుంబాల దైన్య స్థితిని తెలుసుకుని, వారికి తక్షణ సాయం అందించాలని నిర్ణయించుకున్నారు.ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కేవలం 24 గంటల్లోనే వారి ఇంటికి గృహోపకరణాలు అందాయి. టీవీ, టేబుల్ ఫ్యాను, మిక్సర్ గ్రైండర్, ప్రెషర్ కుక్కర్లు, ఇస్త్రీ పెట్టె, ఎల్ఈడీ బల్బులు, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేటులు, పాత్రలు, దుప్పట్లు, దిండులు, కుటుంబం మొత్తానికి నూతన వస్త్రాలు, నిత్యావసర సరకులు అందాయి. ఈ వస్తుసామాగ్రిని తంబలహట్టి తండాలో దీపిక కుటుంబానికి, వంట్లమామిడి (పాడేరు ఘాట్ రోడ్డు) గిరిజన గ్రామంలో కరుణ కుమారి కుటుంబానికీ జనసేన నాయకులు, యంత్రాంగం స్వయంగా వెళ్లి అందించారు.

దీపిక కుటుంబానికి అనంతపురం, హిందూపురం అర్బన్ డెవలప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ టి.సి. వరుణ్, ఇతర జనసేన నేతలు ఈ వస్తువులను అందజేయగా.. కరుణ కుమారి కుటుంబానికి రాష్ట్ర జానపద కళలు, సృజనాత్మక అకాడమీ ఛైర్మన వంపూరు గంగులయ్య, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ శ్రీ వన్నెంరెడ్డి సతీష్ కుమార్, ఇతర జనసేన నేతలు అందజేశారు.

నూతన గృహాల నిర్మాణంపై పర్యవేక్షణ
దీంతో పాటు ఇద్దరు తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద నూతన గృహాలు నిర్మించి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని పవన్ కల్యాణ్ ధికారులకు దిశానిర్దేశం చేశారు. నూతన గృహాల నిర్మాణంపై పర్యవేక్షించాలని తన పేషీకి సూచించారు. కొత్త ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక, డైనింగ్ టేబుల్స్, మంచాలు లాంటి మరికొన్ని గృహోపకరణాలు కూడా సమకూర్చాలని ఆయన నిర్ణయించారు. వరు కష్టం చెప్పుకున్నా మనసు పెట్టి విని, తక్షణ పరిష్కారం చూపించే దిశగా అడుగులు వేసే నాయకుడు పవన్ కల్యాణ్ అని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.

Story first published: Sunday, December 14, 2025, 9:12 [IST]
Other articles published on Dec 14, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+