ఏపీకి మంచి రోజులు వచ్చేశాయోచ్!- అంబటి రాయుడు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి స్పష్టమైన ఆధిక్యతతో దూసుకెళ్తోంది. మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి కూటమి అభ్యర్థులు 120+ స్థానాలకు పైగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మరోవైపు వెఎస్సాఆర్సీపీకి చుక్కెదురైంది. కేవలం 15 స్థానాల్లోనే పైచేయి సాధిస్తోంది.
దీంతో వైఎస్సాఆర్సీపీకి కనీసం విపక్ష హోదా అయినా దక్కుతుందా అనే సందేహాలు మొదలయ్యాయి. ఏపీ అసెంబ్లీలో 175 స్థానాలు ఉన్నాయి. ప్రతిపక్ష హోదా పొందాలంటే కనీసం 18 సీట్లు గెలవాలి. మరోవైపు కూటమి మద్దతుదారులు సంబరాల్లో మునిగిపోయారు. అధికారాన్ని కైవసం చేసుకున్న కూటమికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టీడీపీ-జనసేన-బీజేపీకి కంగ్రాట్స్ అంటూ నెట్టింట పోస్టులు వైరల్‌గా మారాయి.

ప్రముఖ క్రికెటర్లు అంబటి రాయుడు, హనుమ విహారి సైతం కూటమికి శుభాకాంక్షలు చెబుతూ ట్వీట్ చేశారు. ఇది ఏపీ ప్రజల గొప్ప విజయమని, రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయని రాయుడు పేర్కొన్నాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను హనుమ విహారి కొనియాడాడు. పదేళ్ల పట్టుదల, ప్రణాళికతో ఇవాళ 'పవర్'లోకి వచ్చారని అన్నాడు.
''ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గొప్ప విజయం. జనసేన, టీడీపీ, బీజేపీకి శుభాకాంక్షలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి పవన్ కల్యాణ్, చంద్రబాబు సమష్టిగా నిలిచారు. వాళ్ల నాయకత్వంలో రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయి. తన పాదయాత్రతో ఈ అఖండ విజయానికి బలాన్ని, ఊపును తీసుకువచ్చిన నారా లోకేశ్‌కు ప్రతేకంగా శుభాకాంక్షలు'' - అంబటి రాయుడు
గతేడాది అంబటి రాయుడు వైస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ కండువ కప్పుకున్న విషయం తెలిసిందే. అయితే కొద్దిరోజులకే యూటర్న్ తీసుకున్నాడు. కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండాలనుకుంటున్నానని ప్రకటించాడు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్‌తో చర్చించి జనసేనకు మద్దతు ఇచ్చాడు. ఎన్నికల్లో పోటీచేయకపోయినా పవన్ కళ్యాణ్‌తో కలిసి రాయుడు కూటిమికి ప్రచారం చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications