ముంబై: బాలీవుడ్ హీరో రణధీర్ కపూర్ భారత టెస్టు క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్కకు ముద్దుల విషయంలో కితాబు ఇచ్చాడు. పైగా, యే దిల్ హై ముష్కిల్ సినిమాలో ఆమెను ముద్దు పెట్టుకున్నానని కూడా చెప్పాడు. పైగా ఆమె బాయ్ ఫ్రెండ్ (విరాట్ కోహ్లీ) అదృష్టవంతుడని కూడా అన్నాడు.
ఇటీవల విడుదలైన 'యే దిల్‌హైముష్కిల్' బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. చాలా రోజుల తర్వాత విజయాన్ని ఖాతాలో వేసుకున్న రణ్‌బీర్ ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా పోయినట్లు ఉన్నాయి. అందుకే ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌లలో ఆయన చాలా ధీమాగా మాట్లాడాడు.

ఇదిలావుండగా, విరాట్ కోహ్లీ, అనుష్క కలిసి గోవాలో చెట్టాపట్టాలేసుకుని కనిపించారు. ఐఎస్ఎల్ మ్యాచ్ చూస్తూ ఇద్దరూ ఆనందించారు. మ్యాచ్ ముగిసిన తర్వాత డిన్నర్ కోసం రెస్టారెంట్‌కు కూడా వెళ్లారు.