Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రోమ్‌లో హనీమూన్: కోహ్లీ-అనుష్క ఇన్విటేషన్ కార్డు ఇదే

Anushka And Virat's 'Environment Friendly' Sapling Wedding Invitation Card Will Win Your Heart!

హైదరాబాద్: వివాహబంధంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక్కటైన సంగతి తెలిసిందే. డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్న వీరిద్దరూ డిసెంబర్ 21న ఢిల్లీలో.. డిసెంబర్ 26న ముంబైలో అటు క్రికెట్... ఇటు బాలీవుడ్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు రిసెప్షన్ ఇవ్వనున్నారు.

పెళ్లి అనంతరం హనీమూన్‌కు రోమ్‌కు వెళ్లిన కోహ్లీ దంపతులు త్వరలోనే ఢిల్లీ రానున్నారు. అయితే ఇప్పటికే రిసెప్షన్‌కు సంబంధించిన ఇన్విటేషన్లు పలువురు ప్రముఖులకు వెళ్లాయి. ఈ ఇన్విటేషన్‌ను విరాట్ కోహ్లీ తన అభిరుచికి తగ్గట్లుగా సింపుల్‌గా కాకుండా.. ఓ గిఫ్ట్ బాక్స్‌లాగా అతిథులకు అందజేశాడు.

తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ తనకు అందిన ఇన్విటేషన్ కార్డును ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. పెళ్లి రోజు వారిద్దరూ వేసుకున్న డ్రెస్సుల కలర్‌లోనే ఈ ఇన్విటేషన్‌ను రూపొందించారు. ఈ ఇన్విటేషన్‌పై విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల పేర్లు ఉన్నాయి.

అంతేకాదు పక్కనే ఓ చిన్న మొక్కను కూడా ఉంచారు. ఇదిలా ఉంటే హనీమూన్‌ కోసం విరుష్క జంట ప్రస్తుతం రోమ్‌లో పర్యటిస్తోంది. అద్భుతమైన వాతావరణం, అందమైన బీచ్‌లకు రోమ్ పెట్టింది పేరు. ఇందులో భాగంగానే హానీమూన్ కోసం వీరిద్దరూ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.

అనంతరం ఈ రిసెప్షన్ సమయానికి విరుష్క జోడి ఇండియాకు రానుంది. రిసెప్షన్ ముగిశాక కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్తాడు. ఇక న్యూఇయర్ వేడుకల కోసం భార్య అనుష్క కోసం ఓ ప్రత్యేకమైన గెస్ట్ హజ్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులోనే కోహ్లీ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోనున్నాడు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Thursday, December 14, 2017, 15:00 [IST]
Other articles published on Dec 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+