Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

వైరల్ న్యూస్.. టీమిండియా క్రికెటర్‌తో అనుష్క శెట్టి పెళ్లి?!!

Anushka Shetty to marry Indian cricketer, News going viral in Social media

హైదరాబాద్: దక్షిణాదిన ఓ వెలుగువెలుగుతున్న సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి. టాలీవుడ్, కోలీవుడ్ పరిశ్రమలలో అగ్ర హీరోలతో జతకట్టి ఎంతో పాపులర్ అయింది. ఇక దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' సిరీస్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించింది. 1981లో జన్మించిన అనుష్క ఇప్పటివరకు ఇంకా పెళ్లి చేసుకోలేదు. దీంతో స్వీటీ నటించే సినిమాల కంటే.. పెళ్లి విషయమే జనాల్లో ఆసక్తికర అంశంగా మారింది. ఈ నేపథ్యంలో అనుష్క పెళ్లిపై ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టీమిండియా క్రికెటర్‌తో అనుష్క పెళ్లి:

టీమిండియా క్రికెటర్‌తో అనుష్క పెళ్లి:

టీమిండియా క్రికెటర్‌తో అనుష్క శెట్టి వివాహం జరగబోతుందనే కొత్త ప్రచారం నెట్టింట్లో జరుగుతుంది. ఉత్తరాదికి చెందిన ఓ ఆటగాడితో అనుష్క ఏడడుగులు వేయనుందనే వార్తలు సోషల్ మీడియాలో తెగ షికారు చేస్తున్నాయి. ఆ క్రికెటర్‌ ఎవరనే విషయం మాత్రం ఎవరికీ తెలియరాలేదు. ఈ వార్తలపై అనుష్క వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదు. దీనిపై ఎలాంటి అఫీషియల్ సమాచారం లేకపోవడంతో.. కొందరు క్రియేట్ చేసిన రూమర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా అనుష్క క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు వచ్చేలా లేదు.

ప్ర‌భాస్‌తో డేటింగ్:

ప్ర‌భాస్‌తో డేటింగ్:

బాహుబలిలో హీరోగా నటించిన టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్ర‌భాస్‌తో కొన్నాళ్లుగా అనుష్క డేటింగ్ చేసిందనే వార్త‌లు గతంలో వచ్చాయి. ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారంటూ రూమర్స్ హల్చల్ చేశాయి. అయితే దీనిపై అటు ప్ర‌భాస్.. ఇటు అనుష్క మా మధ్య ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా వీళ్ల మ‌ధ్య రూమ‌ర్స్ ఆగలేదు. తాజాగా టీమిండియా క్రికెటర్‌తో అనుష్క శెట్టి పెళ్లి అని మరో రూమర్ వచ్చింది.

సినిమాల‌పైనే స్వీటీ దృష్టి:

సినిమాల‌పైనే స్వీటీ దృష్టి:

ఇండ‌స్ట్రీలో జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని బ‌ట్టి చూస్తుంటే అనుష్క పెళ్లి ఇప్ప‌ట్లో లేన‌ట్లే అనిపిస్తోంది. ప్ర‌స్తుతం స్వీటీ సినిమాల‌పైనే దృష్టి పెట్టింది. బాహుబలి సిరీస్ ద్వారా తన పాపులారిటీని మరింత పెంచుకున్న స్వీటీ.. ఆ తర్వాత 'భాగమతి' సినిమాతో అలరించింది. ఈ సినిమా తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న అనుష్క తిరిగి ఇప్పుడు 'నిశ్శబ్దం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా 'నిశ్శబ్దం' చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

మూగ పెయింటర్‌గా అనుష్క:

మూగ పెయింటర్‌గా అనుష్క:

ఏప్రిల్‌ నెలకు నిశ్శబ్దం సినిమా వాయిదా పడిందని భోగట్టా. థ్రిల్లర్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో అనుష్క మూగ పెయింటర్‌ పాత్రలో నటించారు. ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే, సుబ్బ‌రాజు, శ్రీనివాస అవ‌స‌రాల‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్రాన్ని తెలుగుతో పాటు త‌మిళ, ఇంగ్లీషు, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల్లో భారీ స్ధాయిలో రిలీజ్ చేయనున్నారు.

Story first published: Friday, February 7, 2020, 12:47 [IST]
Other articles published on Feb 7, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+