అనుష్క వద్దని చెప్పంది: అందుకే కోహ్లీ ఛాలెంజ్‌కి నో (వీడియో)
హైదరాబాద్: తొమ్మిది సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసుకుని ఐపీఎల్ పదో సీజన్‌లోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా ఆటగాళ్లు కొత్తదనంతో అభిమానులను అలరిస్తున్నారు. కొత్త ఫ్యాషన్‌ను అనుకరిస్తూ నయా లుక్‌తో అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఐపీఎల్‌లో బ్రేక్ ద బియర్డ్ అన్నది టీమిండియా ప్లేయర్స్ కొత్త స్టైల్.
బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్
ఏప్రిల్ 18న గుజరాత్ లయన్స్ ఆటగాడు రవీంద్ర జడేజా బ్రేక్ ద బియర్డ్ పేరిట ఓ ఛాలెంజ్‌ను ప్రారంభించాడు. ఇందులో భాగంగా తన గడ్డాన్ని, మీసాన్ని వేరు చేస్తూ.. ఐపీఎల్‌లో ఓ కొత్త లుక్‌లో కనిపిస్తున్నాడు. తన లుక్ చేంజ్ చేసే ముందు ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
కొత్త లుక్‌ను వీడియోలో
ముందు గడ్డంతో ఉన్నది, ఆ తర్వాత షేవ్ చేసిన తర్వాత కొత్త లుక్‌ను ఈ వీడియోలో చూపించాడు. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించిన రోహిత్ శర్మ, హార్ధిక్ పాండ్యా హార్దిక్ కూడా జడేజాను ఫాలో అయ్యారు. రవీంద్ర జడేజా లాగే ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ కొత్త లుక్‌తో మైదానంలో ఫ్యాన్స్‌ని ఆకట్టుకుంటున్నారు.
బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్‌ను స్వీకరించని కోహ్లీ
తాజాగా బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆటగాడు విరాట్ కోహ్లీ స్పందించాడు. ఈ సవాలును తాను స్వీకరించలేనని తెలుపుతూ రోహిత్ శర్మ, జడేజాని క్షమాపణలు కోరాడు. మీ కొత్త లుక్ నచ్చినప్పటికీ బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా లేను అని తన పాత్ లుక్‌తోనే ఉన్న ఓ ఫొటోను పోస్టు చేశాడు.
ప్రియురాలు అనుష్క వద్దని చెప్పింది
అనంతరం అభిమానులు సవాలును స్వీకరించమని కొందరు, వద్దని మరి కొందరు తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ నేపథ్యంలో కోహ్లీ ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ 'బ్రేక్ ద బియర్డ్ ఛాలెంజ్‌ని స్వీకరించవద్దని' తన అభిప్రాయాన్ని వెల్లడించింది. దీనిపై స్పందించిన కోహ్లీ ఓకే అని కూడా చెప్పేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications