Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ దంపతులిద్దరూ క్షమాపణలు చెప్పాల్సిందే..!!

 Anushka Sharma, Virat Kohli served legal notice by man scolded in littering video

హైదరాబాద్: ఇటీవల విరుష్కా జోడీ సామాజిక స్పృహ చూపించి సోషల్ మీడియాలో పెట్టిన వీడియోతో విమర్శలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ముంబైకి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపై ప్లాస్టిక్‌ వేశాడని బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ అతన్ని వారిస్తున్న సమయంలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచాడు. విరాట్ ఈ వీడియోను పోస్ట్‌ చేసిన కొద్ది సేపటికే అది వైరల్‌‌గా మారింది.

కావాలనే హంగామా చేసిన విరుష్కా దంపతులు:

కావాలనే హంగామా చేసిన విరుష్కా దంపతులు:

ఆ వీడియోలో ఉన్న అర్హాన్‌ సింగ్‌ అనే వ్యక్తి కూడా అంతే ఫేమస్ అయ్యాడు. దీంతో సామాజిక మాధ్యమాల వేదికగా ఆయన స్పందించారు. విరుష్క దంపతులు నానా హంగామా చేశారని, తాను చేసింది తప్పే అయినా అది సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసి అనవసర రాద్ధాంతం చేశారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో విరుష్క దంపతులకు అర్హాన్‌ సింగ్‌ శనివారం లీగల్‌ నోటీసులు పంపారు.

తానెంతో మనోవేదనకు గురైయ్యానని..

తానెంతో మనోవేదనకు గురైయ్యానని..

‘తనకు సంబంధించిన వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడం ద్వారా తానెంతో మనోవేదనకు గురైయ్యానని.. సోషల్‌ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరిగినందుకు తాను ఎంతో బాధ పడ్డానని..దీనికి ప్రతిగా విరుష్క దంపతులు తనకు క్షమాపణలు చెప్పాలని' లాయర్‌ ద్వారా లీగల్ నోటీసులు పంపారు. అయితే వీటిపై ఇటు అనుష్క శర్మ కానీ, విరాట్‌ కోహ్లీకానీ స్పందించలేదు.

కారులోనుంచి ప్లాస్టిక్‌ ముక్కను:

ఈ నెల 16న విరాట్‌, అనుష్క కారులో ప్రయాణిస్తుండగా.. ఓ లగ్జరీ కారులో వెళ్తున్న అర్హాన్‌ సింగ్ అనే వ్యక్తి కారులోనుంచి ప్లాస్టిక్‌ ముక్కను విసిరేశాడు. దీన్ని గమనించి అనుష్క శర్మ అతడిని ‘ఎందుకు చెత్త రోడ్డుపై పడేశారు? దయచేసి జాగ్రత్తగా ఉండండి. చెత్త బుట్టను వాడండి' అంటూ ప్రశ్నిస్తున్న తరుణంలో విరాట్‌ వీడియోతీసి ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. ‘వీళ్లా దేశాన్ని శుభ్రంగా ఉంచేది?. ఎవరైనా రోడ్డుపై చెత్త పడేయడం చూసినప్పుడు మీరు కూడా అనుష్క లాగే చేయండి. అవగాహన కల్పించండి.' అని విరాట్‌ ట్వీట్‌ చేశాడు. దీంతో అది వైరల్‌ అయింది.

వాళ్లిద్దరూ క్షమాపణలు చెప్పాల్సిందే:

వాళ్లిద్దరూ క్షమాపణలు చెప్పాల్సిందే:

దీనిపై అర్హాన్, అతని కుటుంబ సభ్యులు స్పందించారు. తాను చేసింది చిన్న తప్పే అయినా విరాట్‌, అనుష్క దంపతులు దాన్ని పెద్దది చేసి చూపారని వారు ఆరోపించారు. అయితే అర్హాన్‌ కూడా చిన్న నటుడే. చిన్నతనంలో షారుఖ్‌ ఖాన్ చిత్రం ‘ఇంగ్లిష్‌ బాబు దేశీ మేమ్‌'లో చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా నటించానని షారుఖ్‌తో ఉన్న ఫోటోను అర్హాన్ ట్విటర్‌లో పంచుకున్నారు.

Story first published: Sunday, June 24, 2018, 11:21 [IST]
Other articles published on Jun 24, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+