Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ముంబైలో విరుష్క జోడీ విందు: కుమార్తెతో ధోని, ఆశ్చర్యపరిచిన కుంబ్లే

Anushka Sharma, Virat Kohli’s Mumbai reception, MS Dhoni and Sakshi reach venue

హైదరాబాద్: ముంబైలోని విరుష్క జంట వివాహ విందు ఘనంగా ప్రారంభమైంది. దీని కోసం విలాసవంతమైన రిజిస్‌ హోటల్‌లోని 9వ లెవల్‌లో ఉన్న ఆస్టర్‌ బాల్‌రూమ్‌ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. డిసెంబరు 11న ఇటలీలోని టస్కనీలో వీరి వివాహ బంధంతో ఒక్కటైన విరుష్క జోడీ మంగళవారం (డిసెంబర్ 26) రాత్రి ముంబైలో వివాహ రిసెప్షన్‌ ఏర్పాటు చేసింది.

MS Dhoni ARRIVES at Virat Kohli and Anushka Sharma's Mumbai Reception; Watch Video | Oneindia News

పెళ్లి అనంతరం వీరిద్దరూ అటు నుంచి అటే హనీమూన్‌ కోసం ఫిన్‌లాండ్‌ వెళ్లారు. హనీమూన్ అనంతరం భారత్‌కు వచ్చిన ఈ జోడీ రాజధాని ఢిల్లీలో ఘనంగా రిసెప్షన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ రిసెప్షన్‌కు ప్రధాని మోడీతో పాటు పలువురు క్రికెటర్లు హాజరయ్యారు. పంజాబ్‌ సింగర్ గురుదాస్‌ మాన్‌తో ఏర్పాటు చేసిన సంగీత కచేరిలో విరుష్క జోడీ డ్యాన్స్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక, ఈ రిసెప్షన్‌కు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ సవ్యసాచి ముఖర్జీ ప్రత్యేకంగా రూపొందించిన సంప్రదాయ వస్త్రాలు కోహ్లీ-అనుష్కల జోడీ మెరిసిపోయింది. ఇక, ముంబైలో వివాహ విందుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యారు. ధోని వస్తున్న సమయంలో మీడియా సిబ్బంది ధోని.. ధోని అంటూ కేకలు వేశారు.

అయితే ఈ విందుకు టీమిండియా మాజీ కోచ్ అనిల్ కుంబ్లే కూడా హాజరై ఆశ్చర్యపరిచారు. విరాట్‌ కోహ్లీ కారణంగానే కుంబ్లే తన కోచ్ పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే ముంబై విందులో అనిల్ కుంబ్లే కనిపించడం సర్వతా ఆసక్తిగా మారింది. ఈ విందుకు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌తో బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ హాజరైంది.

Story first published: Wednesday, December 27, 2017, 9:50 [IST]
Other articles published on Dec 27, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+