
హైదరాబాద్: విరాట్ కోహ్లీ టీమిండియా కెప్టెన్ అనొచ్చు. కానీ అనుష్క శర్మని మాత్రం ఇక శ్రీమతి అని పిలవాల్సిందే కదా. ఇవేమీ కాకుండా సిక్సుల వీరుడు యువరాజ్ సింగ్ ముద్దు పేర్లు పెట్టేశాడు.
పర్యటనలో భాగంగా సందర్భంగా భారత జట్టు దక్షిణాఫ్రికాకు బయల్దేరింది. కొత్త జంట విరాట్ కోహ్లీ మాత్రం సతీసమేతంగా పయనమయ్యాడు. అయితే వీరిద్దరినీ మరోసారి యువరాజ్ ముద్దు పేర్లతో విష్ చేశాడు.
'అఫీషియల్‌గా రోజీ ఫ్యాబి పెళ్లి జరిగింది. కోహ్లీ-అనుష్క జోడీకి శుభాకాంక్షలు','మీ భాగస్వామ్యం జీవితాంతం సంతోషంతో నిండాలి. చీకూ-రోజీ ఫ్యాబికి ఎంతో ప్రేమతో శుభాకాంక్షలు' అని యువీ పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీని సహచర ఆటగాళ్లంతా ముద్దుగా 'చీకూ' అని పిలుస్తుంటారు. ఇది అందిరికీ తెలిసిందే. 2015లో రణ్‌బీర్ కపూర్‌తో అనుష్క శర్మ నటించిన చిత్రం 'బాంబే వెల్వెట్'. ఈ సినిమాలో అనుష్క పాత్ర పేరు 'రోజీ ఫ్యాబి'. ఈ పేరుతోనే యువీ అనుష్కను పోల్చాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.