
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి, ప్రముఖ బాలీవుడ్ నటి అనుష్క శర్మ మీడియాకు, ఫోటోగ్రాఫర్లకు ధన్యవాదాలు చెప్పారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ధన్యవాదాలు చెబుతూ రాసుకొచ్చారు. ఈ నెల 16న దక్షిణాఫ్రికా పర్యటన కోసం విరాట్ కోహ్లీ దంపతులు టీమిండియాతో కలిసి దక్షిణాఫ్రికాకు బయలుదేరారు. ఈ క్రమంలో ముంబై ఎయిర్‌పోర్టులో మీడియా, ఫోటోగ్రాఫర్‌లు.. విరాట్ కోహ్లీ, అనుష్కశర్మతోపాటు వాళ్ల ముద్దుల కూతురు వామికా ఫోటోలను కూడా తీయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ వారిని ఫోటోలు తీయోద్దని, మీడియాలో కానీ, సోషల్ మీడియాలో కానీత తమ కూతురు ఫోటోలను ప్రసారం చేయకూడదని కోరాడు.
కోహ్లీ అభ్యర్థనను గౌరవించిన అక్కడి జర్నలిస్టులు వామికా ఫోటోలను ఎక్కడ కూడా బయటపెట్టలేదు. అందుకే కోహ్లీ అభ్యర్థనను గౌరవించి తమ కూతురు వామికా ఫోటోలను బయటపెట్టనందుకు అనుష్క శర్మ సోషల్ మీడియా ద్వారా సదరు జర్నలిస్టులకు ధన్యావాదాలు తెలిపింది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చింది. ఈ సందర్భంగా మీడియాకు, ఫోటోగ్రాఫర్లకు రుణపడి ఉంటామని తెలిపింది.
ఇకపై కూడా మీరంతా ఇలాగే తమకే అండగా ఉండాలని అనుష్క కోరింది. తమ కూతురు మీడియాకు, సామాజిక మాధ్యమాలకు దూరంగా స్వేచ్ఛగా జీవించేలా చూడాలని తాము అనుకుంటున్నామని చెప్పింది. వామిక పెద్దయ్యాక తన స్వేచ్ఛకు తాము అడ్డు పడం కాబట్టి, కనీసం ఇప్పుడైనా తనను స్వేచ్ఛగా బతకనివ్వాలని కోరింది. అందుకే మీడియాతోపాటు నెటిజన్లను సంపూర్ణ మద్దతు కోరింది. వామిక ఫోటోలను పోస్ట్ చేయనందుకు నెటిజన్లకు కూడా ధన్యవాదాలు తెలిపింది.
సఫారీ టూర్‌లో బిజీగా కోహ్లీ
ప్రస్తుతం విరాట్ కోహ్లీ దంపతులు దక్షిణాఫ్రికా టూర్‌లో ఉన్నారు. అక్కడ ఈ నెల 26 నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా సన్నదమవుతుంది. ఈ సిరీస్ కోసం కోహ్లీ తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఈ మధ్య ఫాం కోల్పోయి ఇబ్బంది పడుతున్న కోహ్లీ ఈ సిరీస్‌లో ఎలాగైనా రాణించడమే లక్ష్యంగా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పర్యవేక్షణలో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది. కాగా కోహ్లీని ఇటీవల వన్డే కెప్టెన్‌గా సెలెక్టర్లు తొలగించిన సంగతి తెలిసిందే. అంతకుముందే టీ20 కెప్టెన్సీ నుంచి కోహ్లీ తప్పుకున్న సంగతి విధితమే. దీంతో ఈ సిరీస్‌లో బ్యాటర్‌గానే కాకుండా కెప్టెన్‌గా రాణించి తనను తాను నిరూపించుకోవాలని పట్టుదలగా ఉన్నాడు.