న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీకి షాక్.. నా ఆటోగ్రాఫ్‌ కావాలా అని అడిగిన బుడతడు!!

Virat Kohli Takes Autograph Of 7-Year-Old Fan || Oneindia Telugu
Anushka Sharma Smiles as Virat Kohli Takes Autograph Of 7-Year-Old Fan

జమైకా: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌. ఫార్మాట్ ఏదనే సంబంధం లేకుండా పరుగుల వరద పారిస్తూ 'రికార్డుల రారాజు'గా పేరు సంపాదించాడు. ఇప్పటికే కోహ్లీ దిగ్గజాల రికార్డులను కూడా తిరగరాసాడు. దీంతో కోహ్లీకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ భారీ స్థాయిలో ఉంటుంది. కోహ్లీ ఎక్కడ కనబడినా అభిమానులు ఆటోగ్రాఫ్‌ కోసం పోటీపడుతారు. కోహ్లీ కూడా సమయం ఉంటే అందరికి ఆటోగ్రాఫ్‌ ఇస్తుంటాడు.

<strong>ఉత్కంఠభరిత పోరులో లంకపై కివీస్ విజయం.. సిరీస్‌ కైవసం</strong>ఉత్కంఠభరిత పోరులో లంకపై కివీస్ విజయం.. సిరీస్‌ కైవసం

విహార యాత్రలో:

విహార యాత్రలో:

విరాట్ కోహ్లీ కరీబియన్‌ పర్యటనలో ఉన్నాడు. కోహ్లీ పాటు అతని భార్య, బాలీవుడ్ భామ అనుష్కశర్మ కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. ఇద్దరు మ్యాచులకు మధ్య సమయం దొరికినప్పుడల్లా కరీబియన్‌ అందాలను ఆస్వాదిస్తున్నారు. ఇటీవలే ఆంటిగ్వాలో సందడి చేసిన ఈ జంట.. తాజాగా జమైకాలో విహరిస్తోంది. ఈ క్రమంలో కోహ్లీ దంపతులు తమ విహార యాత్రలో భాగంగా ఓ చోటుకు వెళ్లారు.

నా ఆటోగ్రాఫ్‌ కావాలా:

జమైకాలో వారిని గుర్తించిన ఓ ఏడేళ్ల బుడతడు వెంటనే వారి దగ్గరికి వెళ్లి 'నా ఆటోగ్రాఫ్‌ కావాలా' అని అడిగాడు. ఆ బాలుడు మాటలకు కోహ్లీ ఒక్క సారిగా షాక్ అయ్యాడు. పక్కనే ఉన్న అనుష్క కూడా అవాక్కయింది. వెంటనే విరాట్‌, అనుష్కలు నవ్వుతూ ఆ బాలుడి ఆటోగ్రాఫ్‌ను తీసుకొన్నారు. దీంతో ఆ బాలుడు ఆనందంలో తేలిపోయాడు.

సోషల్ మీడియాలో వైరల్‌:

సోషల్ మీడియాలో వైరల్‌:

దీనికి సంబందించిన వీడియోను ఆ బాలుడు బంధువు అమిత్‌ లక్ష్మీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. 'జమైకాలో జరిగిన రెండో టెస్టు చూడడానికి వెళ్లిన నా ఏడేళ్ల మేనళ్లుడు విరాట్‌ కోహ్లీని బయట కలుసుకొని నా ఆటోగ్రాఫ్‌ కావాలా అని అడిగాడు. వారు వెంటనే ఆటోగ్రాఫ్‌ను తీసుకోవడం సంతోషంగా ఉంది' అని అమిత్‌ లక్ష్మీ తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.

అగ్రస్థానంలో భరత్:

అగ్రస్థానంలో భరత్:

రెండో టెస్టులో 257 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను మట్టికరిపించిన టీమిండియా 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో కరేబియన్‌ దీవుల్లో తొలిసారి టెస్ట్‌ సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన ఘనత భారత్ సాధించింది. ఈ సిరీస్ విజయంతో ఐసీసీ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో 120 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.

Story first published: Wednesday, September 4, 2019, 10:29 [IST]
Other articles published on Sep 4, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X