Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సరిగ్గా వంద గ్రాములు.. కోహ్లీకి కొలిచి పెడుతున్న అనుష్క!!

Anushka Sharma shows how Virat Kohli ensures measured eating in their house


ముంబై: కరోనా వైరస్ కారణంగా నాలుగు నెలలుగా టీమిండియా ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఫ్రీటైంను భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ, అతని భార్య అనుష్క శర్మలు ఆనందంగా గడుపుతున్నారు. ఇంటికే పరిమితమైన వీరిద్దరూ తమ ఆనంద క్షణాలను అభిమానులతో ఎప్పటికప్పుడు సోషల్ ‌మీడియాలో పంచుకుంటున్నారు. ఇద్దరు కలిసి వంట చేస్తున్న వీడియోలు, సరదాగా గడిపే ఫొటోలను సోషల్‌ మీడియాలో ఇప్పటికే పోస్టు చేశారు. విరాట్ కోహ్లీ‌ ఆహారానికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను బుధవారం అనుష్క ఇన్‌స్టాలో షేర్ చేశారు.
కొలిచి పెడుతున్న అనుష్క:

కొలిచి పెడుతున్న అనుష్క:

విరాట్‌ కోహ్లీ ఫిట్‌నెస్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తాడు. ఆహారం విషయంలోనూ కఠినంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. అతను ఏది తిన్నా కొలిచే తింటాడు. మరోవైపు అనుష్క కూడా భర్త ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుందనే దానికి ఈ వీడియో ఒక ఉదాహరణ. వంటగదిలో బరువును కొలిచే మిషన్‌పై పోహా రైస్‌ (అటుకులతో చేసిన పదార్థం)ను పెట్టి అది సరిగ్గా వంద గ్రాములు వచ్చే వరకు.. కొంత వేస్తూ తీస్తూ ఆహారాన్ని జోకుతున్న వీడియోను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో అనుష్క షేర్‌ చేసారు. దాంట్లో ఎక్కువైనా దాన్ని తీసేయడం, తక్కువైతే కొంచెం వేయడం సరదాగా అనిపిస్తుంది. 'ఈ ఇంట్లో ఇలా కొలిచి తింటాం. దానికి కారణం కోహ్లీ' అని అనుష్క వ్యాఖ్య జత చేశారు. నవ్వుతున్న ఎమోజీతో పాటు హార్ట్‌ సింబల్‌ను కూడా పోస్ట్ చేశారు.

ఇంతకాలం ఒకే చోట లేము:

ఇంతకాలం ఒకే చోట లేము:

లాక్‌డౌన్‌లో వారు గడుపుతున్న సమయం గురించి విరాట్ కోహ్లీ ఇటీవల ఇంగ్లండ్ కెప్టెన్ కెవిన్ పీటర్సన్‌తో ఇన్‌స్టా లైవ్‌లో ఇలా అన్నాడు. 'మేము వివాహం చేసుకున్నప్పటి నుంచి ఒకే చోట కలిసి గడిపిన కాలం ఇది. మేము ఒకే సమయంలో ఇంతకాలం ఒకే చోట లేము. ఇది నిజంగా వింతే. సమయాన్ని గడపడానికి ఇది ఒక అవకాశంగా చెప్పలేను కానీ ఇది అలాంటిదే అని భావిస్తున్నా. మేము చాలా జాగ్రత్తగా ఉంటున్నాం' అని చెప్పుకొచ్చాడు.

చిరుతలా పరుగెత్తగల సామర్థ్యం:

చిరుతలా పరుగెత్తగల సామర్థ్యం:

విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలో చిరుతలా మ్యాచ్ మొత్తం పరుగెత్తగల సామర్థ్యం అతని సొంతం. జట్టు సభ్యులంతా రెండు గంటలు కసరత్తులు చేస్తే.. కోహ్లీ నాలుగు గంటలు కష్టపడతాడు. ఎక్కువ సేపు జిమ్‌లో గడుపుతూ భారత ఆటగాళ్లందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. అయితే కరోనా వైరస్ కారణంగా జిమ్‌కు వెళ్లే పరిస్థితి లేకపోవడంతో కోహ్లీ తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి ఇంట్లోనే కష్టపడుతున్నాడు. గాల్లో ఎగురుతూ పుష్‌ అప్స్‌ చేసిన వీడియో, వెయిట్‌లిఫ్టింగ్‌ పుషప్‌ వీడియోను ఇటీవలే అభిమానులతో పంచుకున్నాడు. కోహ్లీ ఫిట్‌నెస్ ఇంతలా ఉండడానికి కారణం జిమ్‌తో పాటు ఆహారం విషయంలోనూ కఠినంగా ఉండడమే.

ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్:

ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్:

2017 మధ్య నుంచి భారత క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కి సంబంధించి యో-యో పరీక్షలు తప్పనిసరిగా నిర్వహిస్తున్నారు. ఇండియన్ క్రికెట్‌లో ఆటగాళ్లు యో-యో టెస్ట్ పాస్ అవ్వక తప్పదు. అందులో పాస్ అయితేనే జట్టులోకి ఎంపికవుతారు. దీంతో ప్రతిఒక్కరు ఫిట్‌నెస్ మెరుగుపరుచుకునేందుకు నిత్యం కష్టపడుతున్నారు. విరాట్ కోహ్లీ రాకముందు ఆటగాళ్లు ఫిట్‌నెస్‌పై అంతగా దృష్టి సారించలేదు. 2008లో టీమింయాలోకి ఎంట్రీ ఇచ్చిన కోహ్లీ.. గ్రౌండ్ పైనే కాదు బాడీపైనా దృష్టి పెట్టాడు. ఫిట్‌నెస్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన క్రికెటర్. ఆటలోనే కాదు ఫిట్‌నెస్ విషయంలోనూ కోహ్లీనే ముందుండి టీమ్‌ని నడిపిస్తున్నాడు. అతడిని చూసి మిగతా భారత క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై దృష్టిసారించారు.

టాస్ సమయంలో రూల్స్‌ మర్చిపోయిన హోల్డర్.. పగలబడి నవ్వుకున్న స్టోక్స్ (వీడియో)

Story first published: Thursday, July 9, 2020, 11:53 [IST]
Other articles published on Jul 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+