Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీని ఇలా ఎప్పుడైనా చూశారా?.. అనుష్క షేర్ చేసిన ఫొటోలు చూస్తే నవ్వేస్తారు!

 Anushka Sharma shares rare and unseen pics off Virat Kohli on his birthday

టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ 34వ పడిలో అడుగుపెట్టాడు. ప్రపంచం నలుమూలల నుంచి కోహ్లీకి బర్త్ డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కోహ్లీ సతీమణి, బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మ కూడా తన భర్తకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పింది. ఈ క్రమంలో ఆమె షేర్ చేసిన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు కోహ్లీని ఎవరూ ఇలా చూడలేదనే చెప్పాలి.

టీమ్‌తో బర్త్‌ డే సంబరాలు..

టీమ్‌తో బర్త్‌ డే సంబరాలు..

ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ ఉన్న సంగతి తెలిసిందే. కోహ్లీకి టీమిండియా సభ్యులందరూ సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పారు. హార్దిక్ పాండ్యా, దినేష్ కార్తీక్ తదితరులంతా కోహ్లీకి విషెస్ చెప్పారు. ఆదివారం నాడు జింబాబ్వేతో పోరుకు సిద్ధమవుతున్న జట్టు మెల్‌బోర్న్‌లో కోహ్లీ బర్త్ డే సంబరాలు చేసుకుంది. జట్టు సభ్యుల మధ్య కేక్ కోసిన కోహ్లీ.. తన 34వ బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్నాడు.

అనుష్క షేర్ చేసిన ఫొటోలు

సెలెబ్రిటీ కపుల్‌లో అన్యోన్యంగా ఉండే జంటల్లో కోహ్లీ, అనుష్క జోడీ ముందు వరుసలో ఉంటుంది. యాడ్ షూట్‌లో కలిసిన వీళ్లిద్దరూ కొంత కాలం పాటు డేటింగ్ చేసి 2017లో పెళ్లి చేసుకున్నారు. ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త బర్త్ డేను కొత్తగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుష్క అనుకుంది. ఈ క్రమంలోనే 'ఇది నీ పుట్టినరోజు ప్రియతమా.. అందుకే నీ బెస్ట్ యాంగిల్స్, బెస్ట్ ఫొటోలతో ఈ పోస్టు చేస్తున్నా. ఏ పరిస్థితిలో అయినా, పద్ధతిలో అయినా, ఏ రకంగా ఉన్నా నీ మీద ప్రేమ మాత్రం తగ్గదు' అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.అవి చూసిన ఫ్యాన్స్ నోరెళ్లబెడుతున్నారు. ఇంత ఫన్నీగా ఉన్న కోహ్లీ ఫొటోలు ఎప్పుడూ చూడలేదని కామెంట్లు చేస్తున్నారు.

సూపర్ ఫామ్‌‌లో కోహ్లీ..

సూపర్ ఫామ్‌‌లో కోహ్లీ..

టీ20 ప్రపంచకప్‌లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఈ టోర్నీలో అద్భుతంగా ఆడుతున్న కోహ్లీ.. నాలుగు మ్యాచుల్లో మూడు హాఫ్ సెంచరీలు సాధించాడు. అలాగే రెండు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డులు కూడా అందుకున్నాడు. కేవలం నాలుగు మ్యాచుల్లోనే 220 పరుగులు చేసిన కోహ్లీ.. టోర్నీలో టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. అతని తర్వాతి స్థానంలో నెదర్లాండ్స్ ఆటగాడు మ్యాక్స్ ఓ డూడ్ (213) ఉన్నాడు. మ్యాక్స్ మొత్తం 7 ఇన్నింగ్స్‌లలో ఈ స్కోరు సాధించడం గమనార్హం.

Story first published: Saturday, November 5, 2022, 16:50 [IST]
Other articles published on Nov 5, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+