Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: వైరల్‌ అవుతోన్న అనుష్క శ‌ర్మ‌ క్వారంటైన్‌ పిక్.. అందరిచూపు వాటిపైనే!!

Anushka Sharma shares quarantine pic from Ageas Bowl stadium, Fans look on her Gucci slippers

సౌథాంప్ట‌న్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రికెట్ ఆటతో కోహ్లీ.. సినిమా, పాప అలనాపాలనతో అనుష్క ఫుల్ బిజీ. ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. ఎప్పటికప్పుడు తమకు సంబందించిన ప్రతి విషయాన్ని విరుష్క జోడి అభిమానులతో పంచుకుంటారు. ఈ క్రమంలో అనుష్క శర్మ శనివారం ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఓ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఆ రూల్ కోహ్లీకి వ‌ర్తించ‌దు:

సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా తాజాగా సౌథాంప్ట‌న్‌ చేరుకున్న విషయం తెలిసిందే. టీమిండియా కెప్టెన్, భర్త విరాట్ కోహ్లీతో క‌లిసి అనుష్క శర్మ ఇంగ్లండ్ వెళ్లింది. శ‌నివారం త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో అనుష్క ఓ ఫ‌న్నీ పోస్ట్ చేసింది. సౌథాంప్ట‌న్‌లోని ఎజియ‌స్ బౌల్ స్టేడియంలో తాను దిగిన ఫొటోను షేర్ చేస్తూ ఆమె రాసిన కామెంట్ అభిమానుల‌కు న‌వ్వు తెప్పిస్తోంది. 'ప‌నిని ఇంటికి తీసుకురావ‌ద్దు అన్న రూల్ కొన్నాళ్ల పాటు విరాట్‌ కోహ్లీకి వ‌ర్తించ‌దు' అని కామెంట్ చేసింది. 'క్వారంటైన్ఎట్‌దస్టేడియం' అని ఓ హ్యాష్‌ట్యాగ్‌ను కూడా పోస్ట్ చేసింది.

అందరి చూపు చెప్పల్స్ పైనే:

అందరి చూపు చెప్పల్స్ పైనే:

ఫొటోలో అనుష్క శర్మ తెల్లటి స్వేటర్ టీ షర్ట్, జాగర్స్, చెప్పల్స్ ధరించి అందంగా నవ్వుతోంది. ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. అయితే అనుష్క వేసుకున్న గూచీ చెప్పల్స్ (గూచీ లోగో ప్రింట్ పూల్ స్లైడ్‌లు) మీదే అందరి దృష్టి పడింది. చూడడానికి ఎంతో బాగున్న గూచీ కొత్తరకం మోడల్ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. ఇంకేముందు అందరు ఆ మోడల్ చెప్పల్స్ కోసం ఆన్‌లైన్‌లో తెగ వెతుకుతున్నారు. ఇంతకు అనుష్క వేసుకున్న గూచీ చెప్పల్స్ ధర సుమారు రూ .31,892 అని సమాచారం. ప్ర‌స్తుతం ఇండియ‌న్ టీమ్ త‌న కుటుంబాల‌తో క‌లిసి ఎజియ‌స్ బౌల్ స్టేడియంలోనే క్వారంటైన్‌లో ఉంటోంది.

తొలిసారి అలా:

తొలిసారి అలా:

అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ ఓ షాంఫూ యాడ్ షూటింగ్‌లో తొలిసారి కలుసుకుని.. ఐదారేళ్లు లవ్‌లో ఉన్నారు. 2017 డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత ఏడాది ఆగస్టులో తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు విరుష్క జోడి ప్రకటించింది. అనుష్క డెలివరీ సమయంలో ఆమె చెంత ఉండేందుకు పెటర్నటీ లీవ్‌పై కోహ్లీ ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే భారత్‌కి వచ్చేశాడు. గత జనవరి 11న కుమార్తెకు జన్మనిచ్చారు. పాప పుట్టిన 21 రోజుల అనంతరం అనుష్క తన మొదటి ఫొటోను షేర్ చేసి చిన్నారి పేరును వెల్లడించారు.

కఠిన క్వారంటైన్‌లో:

కఠిన క్వారంటైన్‌లో:

గత బుధ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత ఇండియ‌న్ మెన్స్‌, వుమెన్స్ టీమ్స్ ఇంగ్లండ్ ఫ్లైటెక్కిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం సౌతాంప్టన్‌లో బస చేస్తున్న ప్లేయర్లు, కుటుంబ సభ్యులు ఒకరినొకరు కలుసుకునే వీలు లేకుండా మూడు రోజుల పాటు కఠిన క్వారంటైన్‌లో గడుపున్నారు. జూన్‌ 18 నుంచి భారత్‌, న్యూజిలాండ్‌ మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. మ్యాచ్‌ ప్రాక్టీస్‌ కోసం టీమిండియాకు స్వల్ప సమయం మిగిలి ఉండగా.. కివీస్‌ మాత్రం ఇంగ్లండ్‌తో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ ఆడుతోంది.

Story first published: Saturday, June 5, 2021, 18:04 [IST]
Other articles published on Jun 5, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+