For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

విరాట్ కోహ్లీ రిటైర్మెంట్‌పై అనుష్కశర్మ భావోద్వేగం

Virat kohli-Anushka Sharma: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోమవారం టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. విరాట్ కోహ్లీ తన 14 ఏళ్ల టెస్ట్ కెరీర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ పో‌స్ట్‌తో ముగించాడు. 2011 జూన్‌లో టెస్ట్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 14 ఏళ్ల అనంతరం టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. విరాట్ కోహ్లీ చివరిసారిగా 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడుతూ కనిపించాడు. విరాట్ కోహ్లీ టెస్ట్ రిటైర్మెంట్‌పై ఆయన సతీమణి అనుష్క శర్మ స్పందించారు. టెస్టులు ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ రిటైర్ కావాలని అనుష్క కోరుకుంది. కానీ విరాట్ కోహ్లీ అలా చేయలేదు.

అనుష్కశర్మ ఇన్‌స్టాలో ఇలా రాసుకొచ్చింది. " అభిమానులు కోహ్లీ రికార్డులు, మైలురాళ్ల గురించి మాట్లాడుకుంటారు. కానీ నేను నువ్వు ఎప్పుడూ చూపించని కన్నీళ్లను, ఎవరూ చూడని పోరాటాలను ఈ ఫార్మాట్‌పై మీరు చూపిన ప్రేమను చూశాను. ఇదంతా నిన్ను ఎంత దూరం చేసిందో నాకు తెలుసు. ప్రతి టెస్ట్ సిరీస్ తర్వాత కొంచెం తెలివిగా, వినయంగా తిరిగి వస్తారు. మీరు ఎదగడం చూడటం ఒక అదృష్టంగా భావిస్తున్నాను. తెల్ల జెర్సీలో ఆడుతున్నప్పుడే నువ్వు రిటైర్ అవుతావని అనుకున్నాను. కానీ నువ్వు నీ మనసు మాట విన్నావు. నువ్వు ఎంతో గొప్పపేరును సంపాదించావని చెప్పాలనుకుంటున్నా." అంటూ అనుష్క శర్మ భావోద్వేగ పోస్ట్ చేశారు.

Anushka Sharma Shares Emotional Post on Virat Kohli Test Retirement

విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల ప్రేమ కథ
బాలీవుడ్ నటీమణులు, క్రికెటర్లు తరచుగా ప్రకటన చిత్రాలలో కనిపిస్తారు. కొన్ని మీడియా నివేదికల ప్రకారం.. విరాట్, అనుష్క ఒక షాంపూ కోసం ప్రకటనలో నటించారు. ఇది వారి మొదటి సమావేశం కాగా.. దీన తర్వాత మాత్రమే డేటింగ్ ప్రారంభమైంది. కొన్ని సంవత్సరాలు డేటింగ్ తర్వాత అనుష్క శర్మ, విరాట్ కోహ్లీ డిసెంబర్ 2017లో వివాహం చేసుకున్నారు. జనవరి 11, 2021న అనుష్క కుమార్తె వామికకు జన్మనిచ్చింది. ఫిబ్రవరి 15, 2024న కుమారుడు 'అకాయ్'కు జన్మనిచ్చింది. ఈ రోజుల్లో అనుష్క సినిమాలకు దూరంగా ఉంది.తన పిల్లలను పెంచడానికి తన సమయాన్ని కేటాయిస్తోంది. విరాట్ కూడా ఎక్కువ సమయం కుటుంబంతోనే గడుపుతున్నాడు.

Story first published: Monday, May 12, 2025, 16:29 [IST]
Other articles published on May 12, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+