హైదరాబాద్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి బాలీవుడ్ నటి అనుష్క శర్మతో వివాహమై సుమారు రెండు నెలలు కావొస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త అల్లుడికి ఏ మామ అయినా ఇల్లో లేక బైకో లేక కారో ఇలా తమ స్థాయిని బట్టి ఇస్తుంటారు. కానీ, విరాట్ కోహ్లీకి మాత్రం అతని మామ, అనుష్క శర్మ తండ్రి రిటైర్డ్ కల్నల్ అజయ్ కుమార్ శర్మ ఓ ఊహించని గిఫ్ట్ ఇచ్చాడు.
ఆ గిప్ట్ భార్యాభర్తల మధ్య ఉండే బంధాన్ని తెలియ చేసేది. ఇంతకీ ఆ గిప్ట్ ఏంటని అనుకుంటున్నారా? 42 కవితలు ఉన్న ఓ పుస్తకం. దీని పేరు స్మోక్స్ అండ్ విస్కీ. విరాట్ కోహ్లీకి కవితలంటే చాలా ఇష్టం. ప్రముఖ రచయిత్రి తేజశ్విని దివ్యా నాయక్ రచించిన ఈ పుస్తకాన్ని అజయ్... విరాట్ కోహ్లీకి కానుకగా ఇచ్చారు.
గురువారం ముంబైలో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అజయ్ కుమార్ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ పుస్తకం తనకు ఎంతగానో నచ్చడంతో ఓ కాపీని వెంటనే తన అల్లుడికి గిఫ్ట్‌గా ఇచ్చాడు. గతేడాది డిసెంబర్ 11న ఇటలీలో కోహ్లీ-అనుష్కలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కోహ్లీ దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు. వృత్తి పరంగా ఇద్దరూ ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఒకరినొకరు ఉద్దేశిస్తూ పోస్ట్‌లు పెడుతూనే ఉన్నారు. కేప్ టౌన్ వేదికగా జరిగిన మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ చేసిన నేపథ్యంలో అనుష్క.. కోహ్లీని మెచ్చుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది.
మరోవైపు అనుష్క నటించిన 'పారి' టీజర్ ఇటీవలే విడుదలైంది. ఈ టీజర్ తనకూ నచ్చిదంటూ కోహ్లీ తన ట్విటర్లో ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.