31వ పుట్టిన రోజు.. అనుష్కతో విరాట్ కబుర్లు

వరుస సిరీస్‌లు, ఐపీఎల్ టోర్నీతో బిజీ షెడ్యూల్ గడిపిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి సరదా సమయం గడిపాడు. తాజాగా ఐపీఎల్ సీజన్-12 నుండి రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిష్క్రమించింది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో బెంగళూరు ప్లేఆఫ్స్ అవకాశాలు పూర్తిగా కొట్టుకుపోయాయి. బెంగళూరు తన తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా బెంగళూరుకు ఉపయోగం ఉండదు.
దీంతో ఇప్పటి వరకూ బెంగళూరు జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చాలనే హడావిడిలో ఉన్న కోహ్లీకి కాస్త విశ్రాంతి దొరికింది. ఈ సమయాన్ని భార్య అనుష్క శర్మతో కలిసి గడుపుతున్నాడు. బుధవారం అనుష్క 31వ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన భార్యతో కలిసి విరాట్ బయటకు వెళ్ళాడు. ఓ సరస్సు ఒడ్డున కూర్చుని అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ కబుర్లు చెప్పుకున్నారు. దీనికి సంబందించిన వీడియోను విరాట్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications