Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఒకే టీ షర్డ్‌ను ధరించిన విరాట్, అనుష్కలు (వీడియో)

Anushka Sharma Rocks Husband Virat Kohlis T-Shirt Yet Again

హైదరాబాద్: టాప్ సెలబ్రిటీ జంటల్లో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు జాబితాలో మొదటి స్థానంలో ఉంటారు. వేర్వేరు రంగాల్లో దూసుకుపోతోన్న కోహ్లీ, అనుష్క అప్పుడప్పుడు చేసే పనులు ప్రధానాకర్షణగా నిలుస్తున్నాయి. తాజాగా ఈ జంట ఇలాంటి పనే ఒకటి చేసి మళ్లీ వార్తల్లో నిలిచారు. అదేంటంటే, జిమ్‌లో ప్రాక్టీసు చేస్తుండగా కోహ్లీ ధరించిన టీ షర్ట్‌ను అనుష్క శర్మ వేసుకుని మెరిపించింది.

తాజాగా అనుష్క శర్మ ఎయిర్‌పోర్ట్‌లో ఓ నలుపు రంగు టీషర్ట్‌తో దర్శనమిచ్చారు. అయితే అంతకుముందు కోహ్లీ జిమ్‌లో సాధన చేస్తూ అచ్చం అలాంటి టీషర్ట్‌తోనే కనిపించడం గమనార్హం. ప్రస్తుతం ఒకే టీ షర్టులో వారిద్దరూ ఉన్న ఫొటోలపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఈ జంటకి ఇది కొత్తేం కాదు. వీరిద్దరి పెళ్లి కూడా వైవిధ్యంగా ఉండాలని సెలవని మీడియా ముందు చెప్పుకొచ్చి ఇటలీలోని టస్కనీలో వివాహం చేసుకుని వచ్చారు. ఆ తర్వాత యూరప్ వెళ్లి హనీమూన్ ముగించుకుని డిసెంబర్ 21న ఢిల్లీ చేరుకున్నారు.

కోహ్లీ తానే స్వయంగా మాట్లాడుతూ.. సచిన్ టెండూల్కర్ తాను అభిమానిని అన్నాడు. ఈ క్రమంలో మంగళవారం జరిగిన సచిన్ పుట్టినరోజుకు కోహ్లీ.. హ్యపీ బర్త్ డే అంటూ విష్ చేశారు. 'పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఎప్పుడూ మీరే మా రియల్ మాస్టర్ బ్లాస్టర్' అని ట్విట్టర్ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశాడు.

ప్రస్తుతం కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టుకు కెప్లెన్సీగా ఐపీఎల్ 2018లో ఆడుతున్నాడు. ఇప్పటి వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు జట్టు పంజాబ్, ఢిల్లీ జట్లను మాత్రమే ఓడించి చివరి నుంచి మూడో స్థానంలో కొనసాగతుంది. బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై జట్టుతో ఆడి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ మ్యాచ్ లో గురు శిష్యులు ఇద్దరూ తలపడనుండటంతో విజయం ఎవరకి దక్కుతుందో అనే ఉత్కంఠ నెలకొంది.

Story first published: Wednesday, April 25, 2018, 14:42 [IST]
Other articles published on Apr 25, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+