బెంగళూరు: బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ వెంటే.. అతని ప్రేయసి, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఉంటోంది. వారిద్దరూ కూడా బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు సంబంధించిన బస్సులోనే ప్రయాణించారు. విరాట్, అనుష్కలు ఒకే సీటులో పక్కపక్కనే కూర్చున్న ఫొటోలు ట్విట్టర్లో హల్‌చల్ చేస్తున్నాయి.

బస్సులో మొదటి సీటులోనే అనుష్క, విరాట్ కూర్చుకున్నారు. ట్విట్టర్ తోపాటు సామాజిక మాధ్యమాల్లో ఈ ఫొటో చక్కర్లు కొడుతోంది. ఐపిఎల్ మ్యాచులో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌కు జరిగిన మ్యాచు సందర్భంగా ఈ ఫొటోను తీసినట్లు తెలుస్తోంది.
తాను క్రికెట్ బాగా ఆడాలని కోరుకుంటుందని విరాట్ ఇటీవల తెలిపిన విషయం తెలిసిందే. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ యజమానిగా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుతో బాగా ఆడి విజయం సాధించాలని కోరిందని తెలిపాడు. కోల్‌కతాపై కోహ్లీ టీం గెలిచిన ఆ మ్యాచును స్టాండ్స్‍లో ఉండి అనుష్క శర్మ వీక్షించింది. ప్రియుడి జట్టు గెలుపును ఉత్సాహంగా ఆస్వాదించింది.
ఇటీవల ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో విఫలమవడంతో విరాట్-అనుష్కలపై పలువురి నుంచి విమర్శలు వచ్చిన తెలిసిందే. అయితే వారిద్దరికి క్రికెట్, సినీ ప్రముఖుల నుంచి మద్దతు లభించింది. విరాట్ విఫలం కావడానికి అనుష్క కారణమెలా? అవుతుందని వారు ప్రశ్నించారు. కాగా, రెండు రోజుల క్రితం తమపై వచ్చిన విమర్శలపై విరాట్ కోహ్లీ కూడా తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పిచ్చి విమర్శలను పట్టించుకోమని తెలిపాడు.