ముంబై: ఎన్‌హెచ్ 10 సినిమా చూసిన తన పైన ప్రశంసలు కురిపించిన తన ప్రియుడు, భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ ట్వీట్‌కు బాలీవుడ్ నటి అనుష్క శర్మ స్పందించారు. కోహ్లీ థ్యాంక్యూ. సో హ్యాపీ అంటూ రీట్వీట్ చేశారు. అనుష్క నిర్మించి, నటించిన ఎన్‌హెచ్ 10 సినిమాకు అనూహ్య స్పందన వస్తోన్న విషయం తెలిసిందే.
బంగ్లాదేశ్‌తో క్వార్టర్ ఫైనల్‌కు ముందు విరాట్ కోహ్లీ తోటి క్రికెటర్లతో కలిసి అనుష్క శర్మ ఎన్‌హెచ్ 10 సినిమాను వీక్షించారు. సినిమాను చూసిన విరాట్.. తన ప్రియురాలి పైన ప్రశంసలు కురిపించాడు. అనుష్క నటనకు ఫ్లాట్ అయిపోయాడు.

సినిమాను చూసిన తర్వాత విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఎన్‌హెచ్ 10 సినిమాను చూశానని, మైండ్ బ్లోయింగ్ అన్నాడు. ఇది అత్యద్భుత చిత్రమన్నాడు. ప్రత్యేకంగా తన ప్రియురాలు అనుష్క శర్మ పర్ఫార్మెన్స్ ఔట్ స్టాండింగ్ అని కితాబిచ్చాడు. తాను గర్విస్తున్నానని చెప్పాడు.
కాగా, ప్రపంచ కప్ గ్రూప్ దశ వరకు కికెటర్లు భాగస్వాములతో ఉండేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) అనుమతి ఇవ్వని సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అనుమతివ్వడంతో ఇప్పుడిప్పుడే క్రికెటర్ల భార్యలు, ప్రియురాళ్లు ఆస్ట్రేలియా వెళ్తున్నారు.