
హైదరాబాద్: వివాహ బంధంతో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ఒక్కటైన సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం విరుష్క జంట ప్రస్తుతం రోమ్‌లో పర్యటిస్తోంది. అద్భుతమైన వాతావరణం, అందమైన బీచ్‌లకు రోమ్ పెట్టింది పేరు. ఇందులో భాగంగానే హానీమూన్ కోసం వీరిద్దరూ అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది.
పెళ్లి అనంతరం పలువురు ప్రముఖులు ట్విటర్ వేదికగా వీరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ.... అనుష్క శర్మకు చేసిన ట్వీట్ వైరల్ అయింది. 'కంగ్రాట్స్ విరాట్ కోహ్లీ. నీ భర్త హ్యాండ్ బుక్ షేర్ చేస్తా. అనుష్క.. నీ ఇంటి పేరును అలానే ఉంచుకో' అని రోహిత్ ట్వీట్ చేశాడు.
రోహిత్ శర్మకు ట్వీట్‌కు అనుష్క సైతం తనదైన శైలిలో స్పందించింది. 'హా..హా..హా థ్యాంక్స్ రోహిత్! అద్భుతమైన ఇన్నింగ్స్‌కు అభినందనలు' అని ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్న వీరిద్దరూ డిసెంబర్ 21న ఢిల్లీలో.. డిసెంబర్ 26న ముంబైలో అటు క్రికెట్... ఇటు బాలీవుడ్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు రిసెప్షన్ ఇవ్వనున్నారు.
ఇప్పటికే రిసెప్షన్‌కు సంబంధించిన ఇన్విటేషన్లు పలువురు ప్రముఖులకు వెళ్లాయి. ఈ ఇన్విటేషన్‌ను విరాట్ కోహ్లీ తన అభిరుచికి తగ్గట్లుగా సింపుల్‌గా కాకుండా.. ఓ గిఫ్ట్ బాక్స్‌లాగా అతిథులకు అందజేశాడు. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ తనకు అందిన ఇన్విటేషన్ కార్డును ఆయన తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు.
పెళ్లి కోసం శ్రీలంకతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్ నుంచి రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్పుకోవడంతో కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మకు అప్పగించిన సంగతి తెలిసిందే. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో రోహిత్ శర్మ డబుల్ సెంచరీతో వన్డేల్లో ప్రపంచ రికార్డు నెలకొల్పిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.