వైరల్ ఫొటో.. కౌగిలితో కోహ్లీకి స్వాగతం పలికిన అనుష్క!!

ముంబై: ఈడెన్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. మూడు రోజుల్లోనే డే/నైట్ టెస్టు ముగియడంతో భారత జట్టు సభ్యులు సోమవారం ముంబైకు చేరుకున్నారు. ఇక బంగ్లా సిరీస్ ముగియడంతో ఆటగాళ్లు అందరూ వారి స్వస్థలాలకు చేరుకున్నారు.

కౌగిలితో కోహ్లీకి స్వాగతం:
ముంబై ఎయిర్ పోర్ట్‌లో దిగిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఆయన భార్య అనుష్క శర్మ ఘనంగా స్వాగతం పలికింది. కోహ్లీ రాకకోసం ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లిన అనుష్క భర్తను స్వయంగా రిసీవ్ చేసుకుంది. భర్తను చూసిన వెంటనే అనుష్క ఆనందంలో మునిగిపోయింది. ఇక కోహ్లీ కారు ఎక్కగానే గట్టిగా హగ్ చేసుకుని తన ప్రేమను వ్యక్తం చేసింది. దీంతో కోహ్లీ సంతోషం వ్యక్తం చేసాడు. దీనికి సంబంధించి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

భూటాన్‌లో విహారం:
క్రికెట్ ఆటష కోహ్లీ, సినిమాలతో అనుష్క ఎప్పుడు బిజీగా ఉంటారు. అయితే ఈ ఇద్దరు తమతమ షెడ్యూల్‌ను బట్టి ట్రిప్‌లు ప్లాన్‌లు చేసుకుంటూ ఉంటారు. ఇటీవల కోహ్లీ పుట్టినరోజు సందర్భంగా భూటాన్‌లో విహరించిన విరుష్క జంట.. వాటికి సంబంధించి ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పెడుతూ అభిమానులతో పంచుకున్నారు.

కోహ్లీ దుస్తులు వేసుకోవడమంటే ఇష్టం:
అనుష్క శర్మ ఇటీవలే వోగ్ మ్యాగజైన్ ఫొటో షూట్లో పాల్గొంది. అనంతరం నిర్వహించిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'కోహ్లీ వార్డ్ రోబ్‌లో చాలా దుస్తులు ఉంటాయి. నాకు నచ్చిన వాటిని వేసుకుంటా. ఎక్కువగా టీషర్ట్స్ వేసుకోవడానికి ఇష్టపడతా. కొన్నిసార్లు కోహ్లీ జాకెట్స్ కూడా వేసుకుంటా. నేను కోహ్లీ దుస్తులు వేసుకుంటే అతను చాలా సంతోషిస్తాడు. నాక్కూడా ఇష్టమే' అని తెలిపింది.

ఇటలీలో వివాహం:
'నేను ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో కాను. అందుకే అందరు అమ్మాయిలు ఎంచుకునే పింక్ కలర్‌నే నా పెళ్లి రోజున ఎంచుకున్నా. పెళ్లి దుస్తులు కావాలని ఎంపిక చేసినవి కావు' అని అనుష్క తెలిపారు. రెండేళ్ల క్రితం ఇటలీలోని టస్కనీలో కోహ్లీ, అనుష్కలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నా.. భారత్ వచ్చాక పెద్ద రిసెప్షన్ ఇచ్చారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications