Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

న్యూజిలాండ్ అందాల వీక్షణ కోసం ప్రైవేట్ జెట్‌లో విరుష్క జోడీ

Anushka Sharma poses with hubby Virat Kohli in front of their private jet, internet goes gaga

హైదరాబాద్: వరుస సిరిస్ విజయాలను సొంతం చేసుకుని మంచి ఊపు మీదున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన భార్య, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. మౌంట్ మాంగనూయ్ వేదికగా సోమవారం ఆతిథ్య జట్టుతో జరిగిన మూడో వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే.

దీంతో ఐదు వన్డేల సిరిస్‌లో మరో రెండు వన్డేలు మిగిలుండగానే టీమిండియా 3-0తో కైవసం చేసుకుంది. టీమిండియాకు ఇది వరుసగా రెండో సిరిస్ విజయం. అంతకముందు ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియాను 2-1తేడాతో ఓడించి వన్డే సిరిస్‌ను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో విరుష్క జోడీ ప్రస్తుతం న్యూజిలాండ్ అందాలను ఆస్వాదిస్తోంది.

న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా ఐదు వన్డేల సిరిస్‌ను కైవసం చేసుకోవడంపై కోహ్లీ సంతోషంగా ఉన్నాడు. మూడో వన్డే అనంతరం అనుష్కతో కలిసి కోహ్లీ ఓ ప్రైవేట్ జెట్‌లో చెక్కర్లు కొడుతున్నాడు. ఇద్దరూ ఓ ప్రైవేట్ ముందు కలిసి ఉన్న ఫొటోను కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న విరాట్ కోహ్లీ అక్కడి అందాలను ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు. రెండో రోజుల క్రితం కోహ్లీ మౌంట్ మాంగనూయ్‌లోని మరీన్‌ పరేడ్‌ బీచ్‌‌లో అందరిలా సాధారణ జీవితం గడిపే అవకాశం తమకు లభించిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

"అనుష్కతో కలిసి మరీన్‌ పరేడ్‌ బీచ్‌లో బెంచ్‌పై కూర్చొని ఆస్వాదించిన క్షణాలు జీవితాంతం గుర్తుండి పోతాయి" అని బీసీసీఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కోహ్లీ తెలిపాడు. కాగా, న్యూజిలాండ్‌తో జరగబోయే మిగతా రెండు వన్డేలతో పాటు మూడు టీ20ల సిరిస్‌కు సెలక్టర్లు కోహ్లీకి విశ్రాంతినిచ్చారు.

"న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను 3-0తో గెలిచాం కాబట్టి సంతోషంగా బ్రేక్‌ తీసుకుంటా. విరామ సమయాన్ని బాగా గడుపుతాను" అని మూడో వన్డే అనంతరం కోహ్లీ చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, January 29, 2019, 15:34 [IST]
Other articles published on Jan 29, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+