Kohli, Anushka reveals funny facts: 'కోహ్లీ దుస్తులు వేసుకోవడమంటే చాలా ఇష్టం'

హైదరాబాద్: బాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొన్న హీరోయిన్ అనుష్క శర్మ. కెరీర్ ఆరంభం నుండి విలక్షమైన పాత్రల్లో నటిస్తూ నిరూపించుకుంది. బాలీవుడ్ సీనియర్, జూనియర్ హీరోలనే తేడా లేకుండా అందరితో జతకట్టింది. కెరీర్ మంచి ఊపులో ఉండగానే.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకొని సినిమాలు తగ్గించేసింది. చివరగా అనుష్క బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్‌తో కలిసి 'జీరో' సినిమాలో నటించింది. ఆ తర్వాత ఏ సినిమాకి సైన్ చేయలేదు.
వోగ్ మ్యాగజైన్ ఫొటో షూట్:
అనుష్క శర్మ సినిమాలు పక్కన పెట్టేసి పూర్తి సమయం భర్త కోహ్లీతో కలిసి గడుపుతోంది. అయితే సినిమాలకు దూరమయినా.. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్‌లోనే ఉంది. కోహ్లీ, తనకు సంబందించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో క్యూట్, హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ తనలో హాట్‌నెస్ ఏ మాత్రం తగ్గలేదని నిరూపిస్తోంది. హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును తనవైపు తిప్పుకుంటోంది. తాజాగా వోగ్ మ్యాగజైన్‌కు అనుష్క శర్మ ఫొటో షూట్ ఇచ్చారు. ఇందులో అనుష్క కనువిందు చేసింది.
కోహ్లీ దుస్తులు వేసుకోవడమంటే ఇష్టం:
వోగ్ మ్యాగజైన్ ఫొటో షూట్ అనంతరం నిర్వహించిన ఇంటర్వ్యూలో అనుష్క శర్మ మీడియాతో మాట్లాడారు. 'విరాట్ కోహ్లీ వార్డ్ రోబ్‌లో చాలా దుస్తులు ఉంటాయి. నాకు నచ్చిన వాటిని వేసుకుంటా. ఎక్కువగా టీషర్ట్స్ వేసుకోవడానికి ఇష్టపడతా. కొన్నిసార్లు కోహ్లీ జాకెట్స్ కూడా వేసుకుంటా. నేను కోహ్లీ దుస్తులు వేసుకుంటే అతను చాలా సంతోషిస్తాడు. నాక్కూడా ఇష్టమే' అని అనుష్క అన్నారు.
ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో కాను:
'నేను ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో కాను. అందుకే అందరు అమ్మాయిలు ఎంచుకునే పింక్ కలర్‌నే నా పెళ్లి రోజున ఎంచుకున్నా. పెళ్లి దుస్తులు కావాలని ఎంపిక చేసినవి కావు' అని అనుష్క తెలిపారు. రెండేళ్ల క్రితం ఇటలీలోని టస్కనీలో కోహ్లీ, అనుష్కలు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కొద్ది మంది సమక్షంలో పెళ్లి చేసుకున్నా.. భారత్ వచ్చాక పెద్ద రిసెప్షన్ ఇచ్చారు.

కోహ్లీతో కలిసి భూటాన్‌లో:
ప్రస్తుతం అనుష్క శర్మ తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి భూటాన్‌లో పర్యటిస్తోంది. ఇటీవల విరాట్ కోహ్లీ తన 31వ బర్త్‌డేను భూటాన్‌లో జరుపుకున్న విషయం తెలిసిందే. ఇంకొన్ని రోజుల పాటు కోహ్లీ, అనుష్క భూటాన్‌లోనే ఉండనున్నారు. ఆ పర్యాటన అనంతరం కోహ్లీ బంగ్లాతో టెస్ట్ సిరీస్ ఆడనుండగా.. అనుష్క తన తర్వాతి ప్రాజెక్ట్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications