For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇంగ్లాండ్: అనుష్కశర్మని కోహ్లీ హోటల్‌కు తీసుకొచ్చాడు!

By Srinivas

లండన్: భారత బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఎక్కడికి వెళితే అక్కడ బాలీవుడ్ నటి అనుష్కా శర్మ ప్రత్యక్షమవుతోంది! ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు బస చేసిన హోటల్‌కు సమీపంలోనే మకాం వేసిందని ప్రచారం జోరందుకుంది. ట్రెండ్ బ్రిడ్జిలో జరిగిన మొదటి టెస్టులో రెండు జట్లకు చెందిన పలువురు బ్యాట్స్‌మెన్, చివరికి టెయిలెండర్లు కూడా విజృంభించారు.

కానీ కోహ్లీ మాత్రం దారుణంగా విఫలమయ్యాడు. అనుష్క అక్కడ ఉన్నందుకే ఆటను అతను నిర్లక్ష్యం చేశాడన్న విమర్శలున్నాయి. సుమారు ఏడాది కాలంగా అనుష్క, కోహ్లీ చెట్టపట్టాలేసుకొని తిరుగుతున్నారు. పలు సందర్భాల్లో ఇద్దరూ కెమేరాలకు చిక్కారు. అయితే, ఈ విషయాన్ని ఇద్దరూ గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు.

Anushka Sharma keeping Virat Kohli company in England, staying in same hotel?

విదేశీ పర్యటనలకు భారత క్రికెటర్లతో పాటు వారి భార్యలు వెళ్లడం చాలా తక్కువ. ఈసారి ఇంగ్లాండులో రెండు నెలల సుదీర్ఘ పర్యటన నేపథ్యంలో క్రికెటర్లలో పలువురు తమ వెంట భార్యలను తీసుకు వెళ్లారు. మురళీ విజయ్ వెంట అతని భార్య నిఖిత, కొడుకు నవీన్, పుజారా వెంట అతని భార్య పూజ ఉంది.

గంభీర్‌తో సహా పలువురు క్రికెటర్లు భార్యలను ఇంగ్లాండుకు తీసుకు వచ్చారు. వీరి కోసం బీసీసీఐ అదనంగా 21 గదులను తీసుకుంది. పలువురు క్రికెటర్లు వారి భార్యలతో వచ్చారు. అయితే, విరాట్ కోహ్లీ మాత్రం తన వెంట ప్రేయసి అనుష్క శర్మను తీసుకు వచ్చాడు. ఇలా గతంలో ఎప్పుడు జరగలేదు. మొదటిసారి బీసీసీఐ గర్ల్ ఫ్రెండ్‌ను అనుమతించిందట.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+