Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అనుష్క అల్లరి: ఏయ్‌ కోహ్లీ.. చౌకా మార్‌ (వీడియో)!!

Anushka Sharma Hilariously Asks Virat Kohli To Hit A Four
Anushka Sharma Hilariously Asks Virat Kohli To Hit A Four

ఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ (కొవిడ్-19) పంజా విసురుతుండడంతో దేశంలో లాక్​డౌన్ విధించిన విషయం తెలిసిందే. లాక్​డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన టీమిండియా కెప్టెన్​ విరాట్ కోహ్లీ, అతడి భార్య అనుష్క శర్మ సరదా సమయాన్ని గడుతున్నారు. అయితే విరుష్క జోడి సోషల్ మీడియా వేదికగా ఫొటోలు, సరదా వీడియోలను పంచుకుంటూ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల కోహ్లీకి న్యూ హెయిర్‌ కట్‌ ట్రై చేసిన అనుష్క.. ఇప్పుడు భర్తను ఆటపట్టించే యత్నం చేసింది.

ఏయ్‌ కోహ్లీ.. చౌకా మార్‌:

ఏయ్‌ కోహ్లీ.. చౌకా మార్‌:

తాజాగా అనుష్క శర్మ ఇన్​స్టాగ్రామ్​లో ఓ వీడియో పోస్ట్ చేసింది. క్రికెట్‌కు దూరమైన విరాట్ కోహ్లీకి దాన్ని గుర్తుచేస్తూ ఫోర్‌ కొట్టూ అంటూ ఒకటే అల్లరి చేసింది. 'కోలీ (కోహ్లీ).. ఏయ్‌ కోలీ.. చౌకా మార్‌.. చౌకా.. క్యా కర్రా' అంటూ సరదాగా ఏడిపించే యత్నం చేసింది అనుష్క. కాగా అనుష్క అల్లరికి కోహ్లీ బిత్తరచూపులు చూడటం తప్పితే చేసేదేమీ లేకపోయింది. అనుష్క మాటలకు ఒక్కసారిగా క్రికెట్‌ గుర్తుకు రావడంతో పేలగా చూస్తూ మౌనంగా ఉండిపోయాడు.

ఆ ఫీల్​ కలిగించేలా చేశా:

ఆ ఫీల్​ కలిగించేలా చేశా:

దీనికి సంబంధించిన వీడియోలను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయగా.. అది వైరల్‌గా మారింది. 'మైదానంలో వినిపించే ఈ మాటలను కోహ్లీ మిస్సవుతున్నాడు. అతడిని ప్రేమించే లక్షలాది మంది అభిమానులతో పాటు.. ఇలా అరిచే ఫ్యాన్స్​ను కోహ్లీ మిస్సవుతున్నాడు. అందుకే అతడికి ఆ ఫీల్​ కలిగించేలా చేశా' అని అనుష్క శర్మ వీడియోకు క్యాప్షన్ జత చేసింది. అభిమానులు కూడా కోహ్లీని తమదైన స్టయిల్లో ఆటపట్టిస్తున్నారు.

ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు:

ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు:

ఇటీవల ప్రస్తుతం అనుష్కతో ఎలా ఉంటున్నావ్‌ అని కెవిన్ పీటర్సన్‌ ప్రశ్నించగా... 'పెళ్లైనప్పటి నుంచి మేమిద్దరం ఒకేచోట ఇన్ని రోజులు కలిసి ఉండటం ఇదే తొలిసారి. ఒకేసారి ఇంతకాలం ఎప్పుడూ ఉండలేదు. కాక్రికెట్, సినిమాలతో ఇద్దరం బిజీగా ఉండేవాళ్లం. ఇప్పుడు కాస్త వింతగా ఉంది. ఈ సమయాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆస్వాదించాలనుకోవడం సరికాదు. కానీ.. అదే జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో సానుకూల దృక్పథంతో ఉండాలి. ఇవి కఠిన రోజులు' అని కోహ్లీ బదులిచ్చాడు.

మరికొన్ని రోజులు ఆటకి దూరం:

భారత్‌లో కరోనా వైరస్ కట్టడి కోసం విరుష్క జోడీ రూ. 3 కోట్లు విరాళంగా ప్రకటించింది. అంతేకాకుండా.. గత నెల నుంచే వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తోంది. మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్‌ని తొలుత ఏప్రిల్ 15 వరకూ వాయిదా వేసిన బీసీసీఐ.. తాజాగా నిరవధికంగా వాయిదా వేసేసింది. దీంతో మరికొన్ని రోజుల పాటు క్రికెటర్లు ఆటకి దూరంగా ఉండనున్నారు.

Story first published: Saturday, April 18, 2020, 11:49 [IST]
Other articles published on Apr 18, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+