Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విరాట్ కోహ్లీ గురించి అనుష్క శ‌ర్మ ఎమోష‌న‌ల్ పోస్ట్‌.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్ !

Anushka Sharma Emtional Words About Indian Captain Virat Kohli

శ‌నివారం టీమిండియా కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోని విరాట్ కోహ్లీ అంద‌రికీ షాకిచ్చాడు. దీంతో అనేక మంది స్పందిస్తున్నారు. కోహ్లీ కెప్టెన్సీపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. తాజాగా విరాట్ కోహ్లీ స‌తీమ‌ణి, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ కూడా కోహ్లీ కెప్టెన్సీ నుంచి త‌ప్పుకోవ‌డంపై త‌న ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా స్పందించింది. ఈ సంద‌ర్భంగా అనుష్క ఉద్వేగానికి గురైంది.

ఆ రోజు బాగా గుర్తు

ఆ రోజు బాగా గుర్తు

2014లో అప్ప‌టి కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని టెస్టు క్రికెట్ నుంచి త‌ప్పుకోవ‌డంతో తాను కెప్టెన్సీ చేస్తున్న‌ట్టు విరాట్ కోహ్లీ త‌న‌తో చెప్పిన విష‌యం త‌న‌కు బాగా గుర్తుంద‌ని అనుష్క శ‌ర్మ త‌న‌ ఇన్‌స్ట్రామ్‌లో రాసుకొచ్చింది. ఆ రోజు త‌ర్వాత విరాట్ కోహ్లీ, ధోని తాను క‌లిసి చాట్ చేసిన విష‌యాన్ని అనుష్క శ‌ర్మ ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకుంది. అప్పుడు కెప్టెన్‌గా ప్ర‌మోష‌న్ పొందిన కోహ్లీ గ‌డ్డం ఎంత త్వ‌ర‌గా నెరిసి పోతుందోన‌ని ధోని స‌రాదాగా వ్యాఖ్యానించిన‌ట్లు తెలిపింది. దీంతో తామంతా బాగా న‌వ్వుకున్నామ‌ని అనుష్క శ‌ర్మ గుర్తు చేసుకుంది. అయితే ఆ రోజు నుంచి నేటి వ‌ర‌కు విరాట్ కోహ్లీ గ‌డ్డం నెరిసి పోవ‌డ‌మే కాకుండా చాలానే చూశాన‌ని చెప్పుకొచ్చింది.

గ‌ర్వ‌ప‌డుతున్నాను

''ఆ త‌ర్వాత మీలోని వృద్ధిని చూశాను. మీ అపారమైన అభివృద్ధితో పాటు మీ చుట్టు, మీ లోప‌ల మీరు ఎదిగిన వృద్ధిని చూశాను. టీమిండియా కెప్టెన్‌గా మీలోని ఎదుగుద‌ల‌, మీ నాయ‌క‌త్వంలో జ‌ట్టు సాధించిన విజ‌యాల ప‌ట్ల నేను గ‌ర్వ‌ప‌డుతున్నాను. అంతేకాకుండా మీలో మీరు ఎదిగిన తీరును చూసి నేను మ‌రింత గ‌ర్వ‌ప‌డుతున్నాను. 2014లో మేము చాలా య‌వ్వ‌నంగా, అమాయ‌కంగా ఉన్నాం. మాలో కేవ‌లం మంచి ఉద్దేశ్యాలు మాత్ర‌మే ఉండేవి. పాజిటివ్ ఆలోచ‌నల‌తో మాత్ర‌మే జీవితంలో ముందుకు వెళ్లొచ్చ‌ని న‌మ్మాం. మీరు ఎదుర్కొన్న స‌వాళ్లు గ్రౌండ్‌లో మాత్రమే ఉండేవి కావు. అయితే ఈ స‌వాళ్లు జీవితంలో మిమ్మిల్ని ప‌రీక్షిస్తాయి'' అని అనుష్క భావోద్వేగంతో త‌న ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో రాసుకొచ్చింది.

మీ కంట్లో క‌న్నీళ్లు ఉన్నాయి

మీ కంట్లో క‌న్నీళ్లు ఉన్నాయి

అంతేకాకుండా విరాట్ కోహ్లీతో త‌న ప్రేమ, మంచి ఉద్దేశ్యాల ప‌ట్ల తాను గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్లు అనుష్క శ‌ర్మ తెలిపింది. కోహ్లీ మంచి కెప్టెన్సీ చేశాడ‌ని కొనియాడిన అనుష్క‌, ఫీల్డ్‌లో అన్నీ గెలిచాడ‌ని చెప్పుకొచ్చింది. అయితే కొన్ని న‌ష్టాల త‌ర్వాత కోహ్లీ కంట్లో క‌న్నీళ్లు ఉండ‌గా తాను అత‌న్ని పక్క‌ల కూర్చున్నాన‌ని అనుష్క తెలిపింది. విరాట్ కోహ్లీ అసాధార‌ణ వ్య‌క్తిగా, సూటిగా ఉంటాడ‌ని ఇప్ప‌టికీ జ‌ట్టు కోసం ఏమైనా చేయ‌గ‌ల‌నా అని ఆలోచిస్తున్నాడ‌ని పేర్కొంది. అదే విధంగా ఇదే విష‌యాన్ని కోహ్లీ ప్ర‌తి ఒక్క‌రి నుంచి ఆశిస్తాడ‌ని అనుష్క చెప్పింది.

అదే కోహ్లీని గొప్ప వాడిగా ఉంచుతుంది.

అదే కోహ్లీని గొప్ప వాడిగా ఉంచుతుంది.

కోహ్లీ సూటిగే ఉండే విధాన‌మే అత‌ని శ‌త్రువు అని పేర్కొన్న అనుష్క శ‌ర్మ‌.. అదే త‌న‌లో, విరాట్ అభిమానుల మ‌న‌సులో కోహ్లీని గొప్ప వాడిగా ఉంచుతుద‌ని చెప్పింది. ఎందుకంటే దాని వెనుక క‌ల్తీ లేని మంచి ఉద్దేశ్యాలు ఉంటాయ‌ని, దానిని అంద‌రూ అర్థం చేసుకుంటార‌ని అనుష్క శ‌ర్మ ఆశించింది. అదే విధంగా కోహ్లీని అర్థం చేసుకున్న వాళ్లు నిజంగా ధన్యులు అని పేర్కొంది. కోహ్లీ త‌న లోపాల‌ను ఎప్పుడూ దాచుకోడని, అదే విధంగా దురాశ‌తో దేనిని కావాల‌నుకోడ‌ని చెప్పింది. ఇక త‌మ ప్రేమ అప‌రిమితం అని చెప్పిన అనుష్క శ‌ర్మ‌.. ఏడేళ్లుగా క్రికెట్‌లో విరాట్ కోహ్లీ నేర్చుకుంటూ ఉండ‌డాన్ని త‌మ కూతురు చూస్తుంద‌ని పేర్కొంది.

Story first published: Sunday, January 16, 2022, 17:05 [IST]
Other articles published on Jan 16, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+