
హైదరాబాద్: కేప్‌టౌన్ లోని న్యూలాండ్స్ వేదికగా జరుగుతున్న తొలిటెస్టు గురించి ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. 12 పరుగులకే మూడు వికెట్లు తీసిన భువనేశ్వర్ ఆశలు పెట్టుకున్న భారత్ దక్షిణాఫ్రికా జట్టును 286పరుగులకే ఆలౌట్ చేసింది. పర్యటనకు భార్యలతో పాటు వెళ్లిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్‌లు వారి మ్యాచ్ చూడమంటూ సతీమణులు స్టేడియంలో కూర్చోబెట్టారు.
మొదటి టెస్ట్ జరుగుతుండగా ప్రత్యక్ష ప్రసారం చేస్తున్న టీవీ ఛానెల్ కెమెరాలో వీరు ముచ్చట్లు చెప్పుకుంటూ చిక్కారు. అయితే ఆ ఛానెల్ వారు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో ఉంచి కొత్త కొత్త కామెంట్లతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.
కోశ్లీ పెళ్లైన తర్వాత ఇదే మొదటి మ్యాచ్ కావడంతో అనుష్క నేరుగా చూడడానికి వచ్చి ఉండొచ్చని అభిమానులు పేర్కొంటున్నారు. తంలో ఐపీఎల్, ఆస్ట్రేలియాతో మ్యాచులకు అనుష్క హాజరైన సంగతి తెలిసిందే. ఈ వారంలో బాలీవుడ్ నటి అనుష్క తిరిగి భారత్ వచ్చి యథావిధిగా సినిమా షూటింగుల్లో పాల్గొంటుందని వార్తలు వచ్చినప్పటికీ ఆమె ఇంకా దక్షిణాఫ్రికాలోనే ఉంది. నూతన సంవత్సర వేడుకల అనంతరం అనుష్క భారత్ తిరిగి వచ్చేస్తుందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా మొదటి టెస్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 286 పరుగులకు ఆలౌట్ అవ్వగా భారత్ 28/3తో కష్టాల్లో పడింది. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ-పుజారా ఉన్నారు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.