For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీ ముఖంపై కుక్కపిల్ల ఫిల్టర్‌: అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో

Virat Kohli 'Cutie' Video Going Viral In Social Media | Oneindia Telugu
Anushka Sharma can’t stop laughing at unsuspecting husband Virat Kohli in new Instagram video

హైదరాబాద్: మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా అడిలైడ్‌ వేదికగా జరిగిన రెండో వన్డేలో కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సెంచరీతో చెలరేగడంతో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. చివరి ఓవర్‌ వరకు ఉత్కంఠకరంగా సాగిన ఈ మ్యాచ్‌లో ధోని ఫినిషింగ్‌ టచ్‌తో విజయం భారత్‌నే వరించిన సంగతి తెలిసిందే.

దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. దీంతో జట్టు సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండాపోయింది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ సంబరాల్లో మునిగితేలాడు. ఈ నేపథ్యంలో కోహ్లీ భార్య, బాలీవుడ్‌ నటి అనుష్క శర్మ.. తన భర్తకు సంబంధించిన ఓ ఫన్నీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు.

విరాట్ కోహ్లీ కుర్చీలో కూర్చుని అటూ ఇటూ ఊగుతూ ఉండగా అనుష్క శర్మ ఈ వీడియో తీశారు. ఆ వీడియోలో విరాట్‌ కోహ్లీ ముఖంపై కుక్కపిల్ల ఫిల్టర్‌ను యాడ్‌ చేసి పోస్ట్‌ చేశారు. వీడియోపై 'క్యూటీ' అని క్యాప్షన్‌ ఇచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

ఈ సిరిస్‌లో చివరిదైన మూడో వన్డే మెల్‌బోర్న్‌ వేదికగా జనవరి 18న జరగనుంది.

Story first published: Wednesday, January 16, 2019, 12:32 [IST]
Other articles published on Jan 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+