
అనుష్క శర్మ సుదీర్ఘ లేఖ
తాజాగా వన్డే ప్రపంచకప్‌లో అనుష్క శర్మకి టీ కప్‌లు అందివ్వడానికి సెలక్టర్లు పని చేశారని ఫరూక్ ఇంజినీర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రపంచకప్ సమయంలో అనుష్కకు టీ కప్‌లు ఇస్తూ భారత సెలక్టర్లు కనిపించారు. ఇదొక మిక్కీ మౌస్ సెలక్షన్ కమిటీ, విరాట్ చెప్పినట్లు వినే ఒక చేతగాని కమిటీ అంటూ ఫరూక్ మండిపడ్డారు. దీనిపై అనుష్క శర్మ ఒక సుదీర్ఘ లేఖ ద్వారా స్పందించారు.

ఇంతకాలం మౌనంగా ఉన్నా
'విమర్శలు చేసేవారు చాలాసార్లు నా గురించి తప్పుగానే చెబుతున్నారు. ఇదే మళ్లీ మళ్లీ పునరావృతం అవుతూ ఉంది. అన్ని నిజాలు అయినట్టు ప్రచారం చేస్తున్నారు. నా గురించి వస్తున్న వార్తలు చూసి భయపడుతున్నా. అర్థం లేని అబద్ధాలతో కూడిన విమర్శలకు, కామెంట్లకు స్పందించడం ఇష్టం లేకే ఇంతకాలం మౌనంగా ఉన్నా. ప్రతీ విషయానికి మాట్లాడకుండా ఉంటే.. పదే పదే విమర్శలు చేస్తున్నారు. దీనికి ఈ రోజైనా ముగింపు దొరకాలని స్పందిస్తున్నా' అని అనుష్క శర్మ అన్నారు.

సొంత ఖర్చులతోనే వెళుతున్నా
'కోహ్లీ ప్రదర్శన బాగా లేనప్పుడు నన్ను టార్గెట్ చేశారు. దీనిపై కోహ్లీ వివరణ ఇస్తూనే ఉన్నాడు. నేను అప్పుడు కూడా సైలెంట్‌గానే ఉన్నా. అనవసరమైన వివాదాల్లోకి తరచు నన్ను లాగుతున్నారు. మీ అందరికీ నేనే దొరికానా. జరిగిన వాస్తవాలను మరుగన పడేస్తున్నారు. కోహ్లీ విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు నా సొంత ఖర్చులతోనే వెళుతున్నా. ఎవరైనా అడిగిన క్రమంలో గ్రూప్ ఫోటోకి ఫోజిచ్చినా నన్నే విమర్శిస్తున్నారు. ఈ వార్తలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి' అని అనుష్క పేర్కొన్నారు.

వివాదాల్లోకి నా పేరు లాగొద్దు
'ప్రపంచకప్ మ్యాచ్‌లో సెలక్టర్లు నాకు టీ అందించారనడం చెడు ఉద్దేశంతో చెప్పిన అబద్ధం. టోర్నీలో నేను ఒక్క మ్యాచే చూశాను. అదీ ఫ్యామిలీ బాక్స్‌లో ఉండి చూశా. సెలెక్టర్ల బాక్స్‌లో నేను కూర్చోలేదు. మీరు సెలెక్షన్ కమిటీపైనా, వారి అర్హతలపైనా ఏవైనా విమర్శలు చేయాలనుకుంటే చేసుకోండి. అది మీ ఇష్టం. కానీ.. వివాదాల్లోకి నా పేరును లాగొద్దు. దురుద్దేశంతో కూడిన వ్యవహారాల్లో నా పేరును వాడటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించను. వాస్తవాలను మాట్లాడండి. ఆధారాలతో మాట్లాడండి. నన్ను ఇక్కడితో వదిలేయండి' అని అనుష్క వేడుకున్నారు.


Click it and Unblock the Notifications












