ముంబై: దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదో వన్డేలో భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ విఫలం కావడంతో మరోసారి.. అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మను క్రికెట్ అభిమానులు టార్గెట్ చేశారు. ముంబైలోని వాంఖేడే స్టేడియంలో జరిగిన ఐదో వన్డేలో భారత్ ఓడింది.

భారత్ 214 పరుగుల తేడాతో చిత్తుగా ఓడింది. ఐదో వన్డేలో కోహ్లీ 7 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో, క్రికెట్ అభిమానులు అనుష్కను మళ్లీ టార్గెట్ చేశారు. ఈ మ్యాచ్ చూసేందుకు అనుష్క శర్మ వచ్చింది. ఆమె విఐపీ బాక్స్‌లో కూర్చుంది. ఆమె రావడాన్ని పదేపదే చూపించారు.
గతంలో ప్రపంచ కప్ సెమీ ఫైనల్లో విరాట్ కోహ్లీ ఫెయిల్ అయినందుకు అభిమానులు అనుష్కను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కోహ్లీ విఫలం అయిన నేపథ్యంలో అభిమానులు ట్విట్టర్లో స్పందించారు. స్టేడియంలో అనుష్క శర్మ ఉంది గుర్తుంచుకోవాలని... క్రికెట్ అభిమాని ట్వీట్ చేశాడు.