
కోహ్లీకి బాగలేదన్న అనుష్క!
కోహ్లీ సెంచరీ సెలబ్రేషన్స్‌ను తన ఇన్‌స్టాగ్రాం ఖాతాలో షేర్ చేసిన అనుష్క శర్మ.. అతనికి ఆరోగ్యం బాగలేదని తెలిపింది. 'ఆరోగ్యం బాగలేకపోయినా ఇంత కంపోజర్‌తో ఆడావు. నన్ను ఎప్పుడూ ఇన్‌స్పైర్ చేస్తూనే ఉంటావు' అని పోస్టు చేసింది. ఇది చూసిన అభిమానులు షాకయ్యారు. కోహ్లీకి ఆరోగ్యం బాగలేదా? అని ఆశ్చర్యపోయారు. అహ్మదాబాద్ టెస్టులో కోహ్లీ చాలా డెడికేటెడ్‌గా కనిపించాడు. దుర్భేద్యమైన డిఫెన్స్‌తో ఆసీస్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కొన్నాడు. అతను అంత డిసిప్లిన్‌గా ఆడింది ఒంట్లో బాగలేకుండానా? అని కామెంట్లు చేశారు.

బ్యాటుతో అదరగొట్టిన కోహ్లీ..
ఈ మ్యాచ్‌లో కోహ్లీ చాలా రికార్డులు బద్దలు కొట్టాడు. స్వదేశంలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. అలాగే టెస్టుల్లో 28వ సెంచరీ సాధించాడు. ఓవరాల్‌గా 75వ అంతర్జాతీయ సెంచరీ చేసి, వంద సెంచరీల సచిన్ రికార్డుకు మరింత చేరువయ్యాడు. అలాగే ఆస్ట్రేలియాపై అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో కూడా ముందడుగు వేశాడు. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 186 పరుగులు చేసిన కోహ్లీ.. ఆసీస్‌పై తన కెరీర్ బెస్ట్ స్కోరు చేశాడు. అతనికి అవతలి ఎండ్ నుంచి సహకారం అందించే బ్యాటర్ తోడు ఉండి ఉంటే కచ్చితంగా డబుల్ సెంచరీ పూర్తి చేసేవాడు కూడా.

అక్షర్ ఏం చెప్పాడంటే?
కోహ్లీతో ఈ మ్యాచ్‌లో పెద్ద భాగస్వామ్యం నెలకొల్పిన బ్యాటర్ అక్షర్ పటేల్. అతను కూడా ధనాధన్ ఆటతో ఆకట్టుకున్నాడు. అనుష్క శర్మ పోస్టు తర్వాత కోహ్లీ ఆరోగ్యంపై తలెత్తిన అనుమానాలను అక్షర్ కొట్టి పారేశాడు. 'ఆ విషయం నాకు తెలీదు. కానీ కోహ్లీ వికెట్ల మధ్య పరిగెత్తిన తీరు చూస్తుంటే తనకు ఒంట్లో బాగలేదని అనిపించలేదు. ఇంత ఎండగా ఉంటే.. అద్భుతంగా ఆడుతూ, పరిగెడుతూ కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. అతనితో కలిపి బ్యాటింగ్ చేయడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పాడు. దీంతో అనుష్క శర్మ అబద్ధం చెప్పిందా? లేక కోహ్లీనే తనకు బాగలేదని ఎవరికీ చెప్పలేదా? అని ఫ్యాన్స్ అనుమానిస్తున్నారు.


Click it and Unblock the Notifications












