Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీతో డేటింగ్ చేయలేదని చెప్పలేదు, వ్యక్తిగతం: అనుష్క శర్మ

ముంబై: బాలీవుడ్ తార అనుష్క శర్మ, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీలు మొదట తమ రిలేషన్‌షిప్ విషయంలో గోప్యత పాటించారు. కానీ, గత కొన్ని నెలలుగా వారు బాహాటంగానే చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నారు. కోహ్లీతో రిలేషన్‌షిప్ పైన అనుష్క ఎప్పుడు బయటకు మాట్లాడేందుకు ఇష్టపడరు. అది తమ వ్యక్తిగతమని చెబుతుంది.

తాజాగా మరో ఇంటర్వ్యూలోను ఆమె స్పందించారు. తనకు, కోహ్లీకి మధ్య రిలేషన్‌షిప్ ఉందని చెప్పారు. తాను తమ మధ్య ఉన్న రిలేషన్‌షిప్‌ను గౌరవిస్తానని చెప్పారు. తమ మధ్య సంబంధం ఉందని, పదేపదే అవే ప్రశ్నలతో తమను అడగవద్దని చెప్పారు.

అది తన వ్యక్తిగత విషయమని చెప్పారు. ఇది తన వ్యక్తిగత విషయమని ఎవరు భావించినట్లుగా కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేయాలో, ఏం చేయకూడదో తనకు తెలుసునని చెప్పారు. దీని గురించి మాట్లాడితే తన వర్క్ డిస్టర్బ్ అవుతుందనే తాను మాట్లాడటం లేదన్నారు. కోహ్లీతో డేటింగ్‌ను తాను ఎప్పుడు ఖండించలేదని చెప్పారు.

 అనుష్క శర్మ

అనుష్క శర్మ

కాగా, భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై అతని ప్రియురాలు, బాలీవుడ్ నటి అనుష్క శర్మ ప్రశంసల జల్లు కురిపించిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ ఎంతో కసివున్న ఆటగాడని పొగడ్తలతో ముంచెత్తింది.

 అనుష్క శర్మ

అనుష్క శర్మ

‘ఎన్‌హెచ్ 10' ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా విరాట్ ప్రదర్శనపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచ కప్‌‌లో కోహ్లీ రాణించడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్ చాలా ముఖ్యమైనదని తెలిపింది.

 అనుష్క శర్మ

అనుష్క శర్మ

క్రికెట్ చూడని వారు కూడా పాకిస్థాన్-ఇండియా మ్యాచ్ అంటే చాలా ఆసక్తి చూపుతారని చెప్పింది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ అనంతరం కోహ్లీకి ఫోన్ చేసి మాట్లాడినట్లు వెల్లడించింది.

 అనుష్క శర్మ

అనుష్క శర్మ

విరాట్ కోహ్లీ ఎంతో ఉత్సాహవంతమైన క్రికెటర్ అని, పాషనేట్ ఆటగాడని కొనియాడింది. గత కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరూ ఇటీవలే తమ అనుబంధాన్ని అంగీకరించిన విషయం తెలిసిందే. న్యూజిలాండ్ పర్యటనలో టీమిండియా ఉన్న సమయంలో కోహ్లీ కోసం అనుష్క శర్మకు అక్కడికెళ్లింది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+