ముంబై: వెస్టిండిస్ డాషింగ్ బ్యాట్స్ మెన్ క్రిస్ గేల్ ఆటోబయోగ్రఫీ పుస్తక విడుదల కార్యక్రమం ఈ రోజు ఢిల్లీలో జరిగింది. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ హాజరయ్యారు. అనంతరం పుస్తకాన్ని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా గేల్ మాట్లాడుతూ, తాను ప్రపంచవ్యాప్తంగా అందరికీ స్ఫూర్తిని కలిగించే వ్యక్తిగా ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపాడు. తన ఆటోబయోగ్రపీని చదివితే యువకులు, క్రికెట్ అభిరుచి ఉన్నవారు స్పూర్తి పొందుతారని అన్నాడు.
తన బ్యాటింగ్ లాగే ఈ పుస్తకం కూడా చాలా వినోదాన్ని పంచుతుందని గేల్ తెలిపాడు. ఈ పుస్తకంలో తన బ్యాట్ నుంచి జాలువారిన కొన్న ఇన్నింగ్స్‌ల వివరాలు కూడా ఉంటాయని గేల్ చెప్పాడు. అయితే ధోనీ రిటైర్మెంట్ గురించి అడిగినప్పుడు మాత్రం తనదైన స్టైల్లో స్పందించాడు.
ధోనీ తనకు తానే క్రికెట్ నుంచి తప్పుకుంటాడని, తనకు నచ్చినప్పుడు అది జరుగుతుందని తెలిపాడు. ధోనీకి ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని అన్నాడు. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ క్రిస్ గేల్ లాంటి వ్యక్తులు క్రికెట్‌కు నిజమైన బ్రాండ్ అంబాసిడర్‌లని అన్నారు.