న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బీసీసీఐ సీక్రెట్స్.. పాటిల్ కామెంట్స్ పై ఠాకూర్ ఫైర్

న్యూఢిల్లీ : బీసీసీఐ అంతర్గత విషయాలను బహిర్గతం చేసినందుకు గాను సెలక్షన్ కమిటి మాజీ చైర్మన్ సందీప్ పాటిల్ పై బీసీసీఐ చీఫ్ అనురాగ్ ఠాకూర్ తీవ్రంగా వ్యతిరేకించారు. బీసీసీఐ నుంచి తప్పుకున్నాక పాటిల్ ఈ కామెంట్స్ చేశారు కాబట్టి ఉపేక్షించాల్సి వస్తోంది గానీ లేదంటే పరిస్థితి మరోలా ఉండేదని, ఒకవిధంగా పాటిల్ ను హెచ్చరించారు ఠాకూర్.

కెప్టెన్‌గా తొలగించాలనుకుంటే ధోనీనే షాకిచ్చాడు!కెప్టెన్‌గా తొలగించాలనుకుంటే ధోనీనే షాకిచ్చాడు!

సెలక్షన్ కమిటీ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత టీమ్ ఇండియా ఆటగాళ్ల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, బీసీసీఐ సీక్రెట్స్ ను బహిర్గతం చేయడం ఎంతవరకు సమంజసం అని సూటిగా పాటిల్ ను ప్రశ్నించారు ఠాకూర్. పాటిల్ చేసిన కామెంట్స్ తో బీసీసీఐకి ఆయన పట్ల తీవ్ర అసంతృప్తి, అపనమ్మకం ఏర్పడినట్టు తెలుస్తోంది. అందుకే అధ్యక్షుడు ఠాకూర్ సైతం.. భవిష్యత్తులో పాటిల్ కు ఏదైనా పని అప్పగించాలంటే ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని అభిప్రాయపడ్డారు.

సచిన్ రిటైర్ కాకుంటే తీసేద్దామనుకున్నాం: సందీప్ షాకింగ్సచిన్ రిటైర్ కాకుంటే తీసేద్దామనుకున్నాం: సందీప్ షాకింగ్

Anurag thakur slams sandeep patil for spilling beans about sachin, ms dhoni

కాగా, టీమ్ ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ తో పాటు ధోనిపై పాటిల్ పలు అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ధోనిని కెప్టెన్సీ నుంచి తప్పించాలని ఎన్నోసార్లు బీసీసీఐలో చర్చించామని, అలాగే టెండూల్కర్ ను సైతం టీమ్ నుంచి గెంటివేయాలన్న ఆలోచనకు వచ్చామని, అయితే ఆలోపే సచిన్ రిటైర్మెంట్ ప్రకటించి తనంతట తానే తప్పుకున్నారని పాటిల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X