Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Ranji Trophy: చరిత్ర సృష్టించిన MI కుర్రాడు.. 10 వికెట్లతో సంచలన బౌలింగ్!(Video)

రంజీ ట్రోఫీ-2024లో రికార్డుల మోత మోగుతోంది. గోవా కుర్రాళ్లు స్నేహల్ కౌతంకర్ - కశ్యప్ బక్లే ట్రిపుల్ సెంచరీలతో 606 పరుగుల అభేద్యమైన ఆల్‌టైమ్ రికార్డు భాగస్వామ్యాన్ని నమోదు చేసిన 24 గంటల్లోపే మరో అరుదైన రికార్డు నమోదైంది. ముంబై ఇండియన్స్ ప్లేయర్, హర్యానా ఫాస్ట్ బౌలర్ అన్షుల్ కాంబోజ్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లతో విజృంభి సంచలన ప్రదర్శన చేశాడు.

కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో నిప్పులు చెరిగే బంతులతో పది మంది బ్యాటర్లను అన్షుల్ కాంబోజ్ పెవిలియన్‌కు చేర్చాడు. 30.1 ఓవర్లు బౌలింగ్ వేసిన ఈ కుడిచేతి వాటం బౌలర్ తొమ్మిది మెయిడిన్లు వేసి 10 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో అన్షుల్ కాంబోజ్ అరుదైన రికార్డులు అందుకున్నాడు. రంజీ ట్రోఫీలో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. అలాగే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఈ అరుదైన ఫీట్ సాధించిన ఆరో భారత బౌలర్‌గా నిలిచాడు.

Anshul Kamboj Makes History Claims All 10 Wickets in an Innings for Haryana in Ranji Trophy Against Kerala

రంజీ ట్రోఫీలో అంతకుముందు ఈ ఘనతను ప్రేమంగ్షు ఛటర్జీ, ప్రదీప్ సుందరం సాధించారు. 1957లో బెంగాల్ తరఫున ఛటర్జీ అస్సాంతో జరిగిన మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు పడగొట్టాడు. అలాగే 1985లో రాజస్థాన్ తరఫున ప్రదీప్ విదర్భపై పది వికెట్లు సాధించాడు. ఇక ఓవరాల్‌గా అన్షుల్ కాంబోజ్ కంటే ముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఛటర్జీ, ప్రదీప్‌‌లతో పాటు సుభాష్ గుప్తే, అనిల్ కుంబ్లే, డిబాసిస్ మొహంతి పది వికెట్లు పడగొట్టారు.

కాగా, అన్షుల్ కాంబోజ్ గత సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం దక్కిన అన్షుల్ రెండు వికెట్లు పడగొట్టాడు. అయితే ఇటీవల అన్షుల్ నిలకడగా ప్రదర్శన చేస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో ఇండియా-సీ తరఫున ఇండియా-బీపై కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ (8/69) చేశాడు. సర్ఫరాజ్ ఖాన్, రింకూ సింగ్ వంటి స్టార్ ప్లేయర్లను ఔట్ చేశాడు. ఇవాళ మరో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

అయితే అన్షుల్ కాంబోజ్‌ను అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకోవాలని భావించిందని జోరుగా ప్రచారం సాగింది. కానీ రిటైన్ లిస్ట్‌లో అన్షుల్‌కు చోటు దక్కలేదు. అయితే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు మిగిలి ఉన్న ఆర్‌టీఎమ్ కార్డ్‌తో మెగా వేలంలో అన్షుల్‌ను దక్కించుకోవాలని ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ భావిస్తోంది.

Story first published: Friday, November 15, 2024, 13:33 [IST]
Other articles published on Nov 15, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+