Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Virat Kohli: కోహ్లి మరో సంచలన రికార్డు.. సలామ్ కొట్టిన గూగుల్

విరాట్ కోహ్లి.. పరిచయం అక్కర్లేని పేరు. నిలకడగా పరుగులు సాధించడం, ఫీల్డింగ్ లో చిరుతల కదలడం, ఫిట్‌నెస్‌లో మేటిగా ఉండటం అతడికే సాధ్యం. అందుకే రికార్డులే విరాట్ పేరు మీద ఉండాలని పోటీపడుతుంటాయి. క్రికెట్ లో ఎన్నో రికార్డులు సాధించిన కోహ్లి మరో ఘనత సాధించాడు. అయితే ఈ సారి ఆటలో కాదు..గూగుల్ లో!

సెర్చ్ ఇంజిన్ గూగుల్.. గత 25 సంవత్సరాల్లో అత్యధికంగా సెర్చ్ చేసిన జాబితాను విడుదల చేసింది. అందులో క్రికెట్ విభాగంలో విరాట్ కోహ్లి గురించి అత్యధికంగా గూగుల్ లో వెతికారని తెలిపింది. సహచర, ప్రత్యర్థి ఆటగాళ్లను కాదని కోహ్లి ఈ రికార్డులోనూ దూసుకెళ్లాడు. ఇక మోస్ట్ సెర్చడ్ అథ్లెట్ గా క్రిస్టియానో రొనాల్డో ఉన్నాడు.

Another sensational record of Virat Kohli. Kohli’s the most searched cricketer of all time in Google

ఇటీవల విరాట్ కోహ్లి దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. వన్డే ఫార్మాట్ లో 50 సెంచరీలు చేసిన ఏకైక ప్లేయర్ గా కోహ్లి చరిత్రకెక్కాడు. గతంలో వన్డేల్లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ (49) పేరిట ఉంది. ఇక ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్ లో పరుగుల వరద పారించిన కోహ్లి 'ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ'గా ఎంపికయ్యాడు.

ప్రపంచకప్ లో 11 మ్యాచ్ ల్లో కోహ్లి 95.62 సగటుతో 765 పరుగులు చేశాడు. మూడు శతకాలు, ఆరు హాఫ్ సెంచరీలో ఉన్నాయి. అంతేగాక ఓ ప్రపంచకప్ లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా విరాట్ రికార్డు సాధించాడు. అయితే సచిన్ 100 సెంచరీల రికార్డుకు కోహ్లి 20 సెంచరీల దూరంలో ఉన్నాడు. కోహ్లి అన్ని ఫార్మాట్లలో కలిపి 80 శతకాలు చేశాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లి సౌతాఫ్రికాతో జరగనున్న టెస్టు సిరీస్ కు సన్నద్ధమవుతున్నాడు.

Story first published: Tuesday, December 12, 2023, 11:46 [IST]
Other articles published on Dec 12, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+