For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPLలో మరో కొత్త లొల్లి: హార్దిక్‌-ఇర్ఫాన్ పఠాన్ గొడవకు కారణం ఇదేనా?

ఐపీఎల్-2024లో ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన చేస్తోంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయాన్ని చవిచూసింది. వాంఖడే వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. కాగా, తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయానికి దగ్గరగా వచ్చిన ముంబై రాజస్థాన్ మ్యాచ్‌లో మాత్రం దారుణంగా విఫలమైంది. సొంతమైదానం అయిన వాంఖడేలో కూడా ముంబై ఇండియన్స్ ఓటమిపాలవ్వడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్లు ముంబై ఓటమి గురించి తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. అయితే టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ మాత్రం అందరికంటే భిన్నంగా స్పందిస్తున్నాడు. ఈ సీజన్ ప్రారంభమైన మొదటి నుంచి హార్దిక్ పాండ్య కెప్టెన్సీపై పఠాన్ దారుణంగా విమర్శిస్తూ ట్వీట్‌లు చేస్తున్నాడు. ఇతర మ్యాచ్‌ల గురించి కూడా ఇర్ఫాన్ స్పందిస్తున్నా ముంబై మ్యాచ్‌ల్లో మాత్రం అతడి రియాక్షన్ భిన్నంగా ఉంది. హార్దిక్ పేరును ప్రస్తావించకుండా తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాడు.

Another new fight in IPL 2024 What caused the Hardik-Irfan Pathan feud

20 పరుగులకే ముంబై నాలుగు వికెట్లు కోల్పోయిన స్థితిలో బ్యాటింగ్‌కు వచ్చిన హార్దిక్ పాండ్య (34; 21 బంతుల్లో) ప్రతిదాడికి దిగుతూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు.అయితే కుదురుకున్నట్లుగా కనిపించిన హార్దిక్ చాహల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జట్టులో టాప్ స్కోరర్ అయిన హార్దిక్ బ్యాటింగ్ గురించి ఇర్ఫాన్ పఠాన్ పరోక్షంగా ట్వీట్ చేశాడు. 'ఆట గురించి బాగా తెలిసిన వాళ్లకు ఇది అర్థమైతుంది. మీరు కుదురుకుంటే జట్టును ఆఖరి వరకు తీసుకుని వెళ్లాలి' అని ఇర్ఫాన్ అన్నాడు.

అంతేగాక ఈసారి బుమ్రాకు హార్దిక్ కొత్తబంతిని వెంటనే అందించడంపై వ్యంగ్యంగా స్పందించాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో బుమ్రాతో హార్దిక్ ఆలస్యంగా బౌలింగ్ చేయించిన విషయం తెలిసిందే.'జట్టులో అత్యుత్తమ బౌలర్‌కు తొందరగా బాల్‌ను అందించడానికి ఈ సారి రాకెట్ సైన్స్‌ను ఏం వాడలేదు. మొత్తంగా బుమ్రా కొత్తబంతిని అందుకున్నాడు. రాజస్థాన్ ముందు స్వల్ప లక్ష్యం ఉండటంతో బలవంతంగా ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు' అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు.

అయితే హార్దిక్ పాండ్యపై ఇర్ఫాన్ పఠాన్ ఇలా ప్రత్యేకంగా ఎందుకు విమర్శిస్తున్నాడనే విషయంపై స్పష్టత లేదు. ఇద్దరి మధ్య ఏమైనా గొడవ జరిగి ఉంటుందా? రోహిత్ శర్మను కాదని హార్దిక్ కెప్టెన్సీ పగ్గాలు అందుకోవడం ఇర్ఫాన్‌‌కు ఇష్టం లేదా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై ఓటమికి హార్దిక్ కారణమని ఇప్పటివరకు ఇర్ఫాన్ పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నాడు. అయితే ముంబై విజయం సాధించినప్పుడు పఠాన్ ఎలా స్పందిస్తాడో చూడాలి. ఈ సీజన్‌లో హార్దిక్‌కు మద్దుతగా ఒక్క ట్వీట్ అయినా చేస్తాడో లేదా చూడాలి.

Story first published: Tuesday, April 2, 2024, 9:35 [IST]
Other articles published on Apr 2, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+