Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Babar Azam: బ్యాటింగ్ చేస్తూ ఫీల్డింగ్ చేయడమేంటి బాబర్ అజామ్? (వీడియో)

పాకిస్థాన్ టీమ్ చేసే చెత్త ఫీల్డింగ్ మీమర్స్ కు ఎప్పుడూ మంచి కంటెంట్ గా నిలుస్తూనే ఉంది. బంతిని అందుకోవడానికి ఇద్దరు ఫీల్డర్లు పోటాపోటీగా దగ్గరకు రావడం.. చివరికి అది బౌండరీకి చేర్చడం వారికే చెల్లుతుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. తాజాగా ఆ జాబితాలో ఇప్పుడు మరో వీడియో చేరింది. అయితే ఈ సారి బాబర్ అజామ్ ఫీల్డింగ్ కు ఓ ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే.. నాన్ స్ట్రైకర్ లో ఉన్న బాబర్ బంతిని అడ్డుకొని పాక్ జట్టుకే రన్స్ తగ్గించాడు.

ఈ ఫన్నీ ఇన్సిడెంట్ వార్మప్ మ్యాచ్ లో జరిగింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో పాకిస్థాన్ జట్టు మూడు టెస్టులు ఆడనుంది. ప్రాక్టీస్ లో భాగంగా ఇవాళ నుంచి ప్రైమ్ మినిస్టర్ XI టీమ్ తో పాక్ నాలుగు రోజుల వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. అయితే పాక్ కెప్టెన్ షాన్ మన్సూద్ స్ట్రైకింగ్ లో ఉండగా, మరో ఎండ్ లో బాబర్ అజామ్ ఉన్నాడు. వెబ్‌స్టర్ వేసిన బంతిని ఆడిన మన్సూద్ సింగిల్ తీయడానికి ప్రయత్నించాడు.

Another funny incident by Babar Azam. He done fielding as a non-striker.

అయితే ఆ టైమ్ లోకి బాబర్ కు ఏమనిపించిందో మరి.. సింగిల్ కు ప్రయత్నించకుండా బాల్ ను ఆపడానికి ట్రై చేశాడు. దీంతో ఆటగాళ్లంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీనికి సంబంధించిన వీడియోను 'ఆస్ట్రేలియా క్రికెట్' ట్విటర్ లో షేర్ చేస్తూ... 'నాన్ స్ట్రైకర్ గా ఉండటానికి బాబర్ ఇలా ప్రయత్నిస్తున్నాడు' అంటూ ఫన్నీగా రాసుకొచ్చింది. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

కాగా, వన్డే వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పేలవ ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. తొమ్మిది మ్యాచ్ లు ఆడిన పాక్ నాలుగు మ్యాచ్ ల్లోనే గెలిచి సెమీఫైనల్స్ కు అర్హత సాధించలేకపోయింది. పసికూన అఫ్గానిస్థాన్ చేతిలోనూ ఓటమిపాలైంది. దీంతో బాబర్ అజామ్ కెప్టెన్సీపై వేటు పడింది. అన్ని ఫార్మాట్స్ నుంచి అతడిని సారథిగా తొలగించింది. ప్రస్తుతం అతడు బ్యాటర్ గా మాత్రమే కొనసాగుతున్నాడు. కాగా, డిసెంబర్ 14 నుంచి పాకిస్థాన్- ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు జరగనుంది.

Story first published: Wednesday, December 6, 2023, 11:23 [IST]
Other articles published on Dec 6, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+