'సచిన్​ క్యూట్​గా అనిపించి.. అతని వెంట పరుగెత్తా! నా వైపు కూడా చూడలేదు'

ముంబై: క్రికెట్‌ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్‌ టెండూల్కర్​ను తాను తొలిసారి చూసిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు అతని సతీమణి అంజలి. ఇంగ్లండ్ పర్యటన అనంతరం స్వదేశానికి వచ్చిన 17 ఏళ్ల సచిన్‌ను తాను మొదటగా ముంబై ఎయిర్​పోర్ట్​లో చూశానని వెల్లడించారు. అప్పటికీ సచిన్ తనకు తెలియకున్నా.. క్యూట్​గా ఉండడం వల్ల అతని వెంట పడ్డట్లు చెప్పారు. అప్పుడు 17 ఏళ్ల సచిన్..​ తనకి 12 ఏళ్ల పిల్లాడిలా కనిపించాడని అంజలి తెలిపారు. సచిన్ సతీమణి అంజలి డాక్టర్ అన్న విషయం తెలిసిందే. సచిన్ కంటే అంజలి వయసులో 5 ఏళ్లు పెద్దవారు. ప్రస్తుతం సచిన్ వయసు 48 కాగా.. అంజలికి 53.


CRICURU: క్రికెట్ లెర్నింగ్ వెబ్‌సైట్‌ని లాంచ్ చేసిన సెహ్వాగ్!!

క్యూట్​గా అనిపించి:

క్యూట్​గా అనిపించి:

అంజలి తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సచిన్‌ టెండూల్కర్​ను తొలిసారి చూసిన అనుభవంను గుర్తు చేసుకున్నారు. 'అప్పుడు ఇంగ్లండ్ పర్యటన అనంతరం భారత జట్టు స్వదేశానికి వచ్చింది. ఆ సమయంలో నాకు సచిన్ ఎవరో తెలీదు. నా ఫ్రెండ్​ అపర్ణ నాతో పాటు ఉంది. నాకు అతని గురించి చెప్పింది. క్రికెట్​లో అతడొక అద్భుతమని.. అతి చిన్న వయసులో సెంచరీ చేసిన ఆటగాడు అని తెలిపింది. అప్పట్లో క్రికెట్ పట్ల నాకు పెద్దగా ఆసక్తి లేదు. అందుకే అతడెవరైతే నాకెంటని అనుకున్నా. కానీ సచిన్​ చూడడానికి క్యూట్​గా అనిపించి.. అతని వెంట పరుగెత్తా' అని అంజలి ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

 సచిన్ వెంట పరుగెత్తా:

సచిన్ వెంట పరుగెత్తా:

'ఆ రోజుల్లో ఎయిర్​పోర్ట్​ల్లో వీక్షకుల కోసం ఓ గ్యాలరీ ఉండేది. ఇంగ్లండ్ నుంచి రావాల్సిన మా అమ్మ కోసం నేను ఎదురుచూస్తున్నా. అప్పుడే సచిన్‌ టెండూల్కర్​ను తొలిసారి చూశా. చాలా అందంగా ఉన్నాడు. నా ఫ్రెండ్​ అపర్ణను మరోసారి అడిగా. ఇక అమ్మ గురించి మర్చిపోయా. సచిన్ అంటూ పిలుస్తూ అతని వెంట పరుగెత్తా. ఆ సమయంలో సచిన్​తో పాటు నితిన్​, అజిత్​ ఉన్నారు. ఈ అమ్మాయి నా వెంటపడుతోంది ఏంటని సచిన్ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ క్రమంలో నా వంక కూడా చూడలేదు. నా వైపు చూడకుండానే కారులోకి ఎక్కాడు' అని అంజలి చెప్పారు. 1995లో సచిన్ ,​అంజలి వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరికి సారా, అర్జున్​ అనే ఇద్దరు పిల్లలున్నారు.

ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులు:

ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులు:

1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ‌ఆడిన సచిన్ టెండూల్క‌ర్‌.. అంతర్జాతీయ క్రికెట్‌లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్‌ మొత్తంలో 34,357 పరుగులు బాదారు. టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ చేశారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్‌గా సచిన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.

 అభిమానులకు సందేశం:

అభిమానులకు సందేశం:

ఇటీవల ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ తన అభిమానులకు మంచి సందేశం ఇచ్చారు. చెట్లను నాటి ఈ ప్రకృతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. కాలుష్యంతో ప్రమాదకరంగా మారుతున్న ఈ నేలతల్లిని తమవంతుగా బాగుచేయాలని కోరారు. ఈ క్రమంలోనే సచిన్ కూడా తన వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు నాటి మొక్కలను పెంచారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Thursday, June 10, 2021, 10:43 [IST]
Other articles published on Jun 10, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X