Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Viral Video: సీక్రెట్ లవర్స్ దొరికేశారు!: న్యూయార్క్ వీధుల్లో కావ్యమారన్, అనిరుధ్

Viral Video: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ , ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్యమారన్ మధ్య ప్రేమాయణం సాగుతోందంటూ వస్తున్న పుకార్లు ఇప్పుడు మరింత బలం పుంజుకున్నాయి. తాజాగా వీరిద్దరు అమెరికాలోని న్యూయార్క్ వీధుల్లో కలిసి కనిపించడంతో వచ్చే ఏడాదిలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ఊహాగానాలు కోలీవుడ్ వర్గాల్లో ఊపందుకున్నాయి.

న్యూయార్క్ వీధుల్లో రహస్య ప్రేమికులు
ఈ ప్రేమ వార్తలకు ఓ సంఘటన బలాన్ని చేకూర్చింది. ఒక అమెరికన్ యూట్యూబర్ న్యూయార్క్ వీధుల్లో వీడియో చిత్రీకరిస్తుండగా.. అనిరుధ్, కావ్యమారన్ అనుకోకుండా కెమెరాకు చిక్కారు. ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే వైరల్‌గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు.. "సీక్రెట్ లవర్స్ దొరికేశారు!" అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఐపీఎల్ వేదికల వద్ద మాత్రమే కనిపించే కావ్యమారన్.. ఇలా అనిరుధ్‌తో కలిసి న్యూయార్క్ వీధుల్లో స్వేచ్ఛగా తిరగడం చూస్తుంటే.. వీరిద్దరి మధ్య బంధం కేవలం స్నేహం మాత్రమే కాదని.. అంతకు మించి ఏదో ఉందని చర్చ జోరందుకుంది.

Anirudh Ravichander and Kavya Maran Spotted Together in New York Fueling Marriage Rumours

కోలీవుడ్‌లో జోరుగా ప్రచారం: వచ్చే ఏడాదే పెళ్లి?
అనిరుధ్ రవిచంద్రన్, కావ్య మారన్ ప్రేమలో ఉన్నారంటూ గతంలోనూ వార్తలు వచ్చినా.. ఈ న్యూయార్క్ వీడియోతో ఆ ఊహాగానాలకు మరింత బలం దొరికింది. వచ్చే ఏడాదే వీరి పెళ్లి జరగబోతోందని.. ఈ విషయంలో ఇరు కుటుంబాల పెద్దల అంగీకారం కూడా ఉందని కోలీవుడ్ మీడియా వర్గాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. అయితే గతంలో ఈ వార్తలు వచ్చినప్పుడు అనిరుధ్ టీమ్ త్వరగా స్పందించింది. "వారిద్దరూ కేవలం మంచి స్నేహితులు మాత్రమే, వారి మధ్య ప్రేమ వంటిదేమీ లేదు" అని ఆ వార్తలను ఖండించింది. కానీ తాజా వీడియో తర్వాత అనిరుధ్ లేదా కావ్య టీమ్ ఇప్పటివరకు స్పందించకపోవడం గమనార్హం. ఈసారి అయినా ఈ పెళ్లి వార్తలపై ఎవరో ఒకరు స్పష్టత ఇస్తారేమోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

అనిరుధ్: సౌత్ ఇండియన్ మ్యూజిక్ కింగ్
ప్రస్తుతం అనిరుధ్ రవిచంద్రన్ దక్షిణాది చిత్ర పరిశ్రమలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ధనుష్ హీరోగా నటించిన 'త్రీ' (3) సినిమాతో తన కెరీర్‌ను ప్రారంభించి, 'కొలవెరి డి' పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తక్కువ సమయంలోనే అగ్రస్థానానికి చేరుకున్న అనిరుధ్.. ఒక్కో సినిమాకు సుమారు రూ. 15 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారని సమాచారం. ప్రస్తుతం ఆయన చేతిలో విజయ్ 'జననాయగ‌న్', లోకేశ్‌ కనగరాజ్ 'డీసీ' వంటి భారీ తమిళ చిత్రాలతో పాటు, తెలుగులో నాని 'ది ప్యారడైజ్', జూనియర్ ఎన్టీఆర్ 'దేవర 2' వంటి భారీ ప్రాజెక్టులు ఉన్నాయి.

కావ్య మారన్: ఐపీఎల్ ఫ్యాన్స్ ఫేవరెట్
కావ్య మారన్ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు సహ-యజమానురాలిగా, ఛైర్మన్‌గా తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు. మ్యాచ్‌లలో ఆమె చూపించే ఉద్వేగం, ఆటగాళ్లు వికెట్ తీసినప్పుడు లేదా మ్యాచ్ గెలిచినప్పుడు ఆమె ఇచ్చే హావభావాలు, ఆందోళన సోషల్ మీడియాలో తరచూ ట్రెండ్ అవుతుంటాయి. తాజా వీడియోతో మరోసారి వీరిద్దరి రిలేషన్‌షిప్ టాలీవుడ్, కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ పెళ్లి పుకార్లపై త్వరలో నిజం బయటపడుతుందేమో వేచి చూడాలి.

Story first published: Thursday, November 13, 2025, 13:19 [IST]
Other articles published on Nov 13, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+