Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

రూ 7.5 కోట్లు: కెప్టెన్ సంపాదనలో 60 శాతం కోచ్‌కి, కుంబ్లే ప్రతిపాదనలివే

హైదరాబాద్: ఏడాది కాలంలో టీమిండియా ప్రధాన కోచ్‌గా తనదైన ముద్ర వేశాడు అనిల్ కుంబ్లే. అయితే చివరకు కెప్టెన్ కోహ్లీతో విభేదాల నేపథ్యంలో అతడిని బీసీసీఐ అవమానకరంగా సాగనంపింది. తాను కోచ్‌గా ఉన్న సమయంలో అనిల్ కుంబ్లే ఆటగాళ్లు, జట్టు సపోర్టింగ్ స్టాఫ్ జీతాల విషయంలో కూడా గట్టిగానే పోరాడాడు.

ఈ విషయంలో బీసీసీఐ అధికారులతో చర్చలు జరిపిన కుంబ్లే పలుమార్లు బోర్డు పాలకుల కమిటీ (సీఓఏ)తోనూ ఎన్నో సార్లు సమావేశమయ్యాడు. కెప్టెన్ల జీతాలతో పోలిస్తే జట్టు ప్రధాన కోచ్ జీతం ఏడాదిలో కెప్టెన్‌ సంపాదించే మొత్తంలో 60 శాతం ఉండాలని ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు సీఓఏకు సమర్పించిన నివేదికలో కోరాడు.

ఈ క్రమంలో ఆటగాళ్ల కాంట్రాక్ట్‌లతో పాటు జట్టు సపోర్టింగ్ స్టాఫ్ జీతభత్యాల పునర్‌వ్యవస్థీకరణపై 19 పేజీల ప్రతిపాదనలను సీఓఏకు సమర్పించాడు. అందులో కుంబ్లే నిర్దిష్ట ప్రతిపాదనలు చేశాడు. పరస్పర విరుద్ధ ప్రయోజనాల ఊసు లేకుండా జాతీయ కోచ్‌లతోపాటు సపోర్టింగ్ స్టాఫ్‌లతో అందరూ ఐపీఎల్ ద్వారా సంపాదించుకునేందుకు మద్దతు తెలిపాడు.

జీతాలలో 20 శాతం ఫిట్‌నెస్ ప్రమాణాల ప్రాతిపదికగానే ఆటగాళ్లకు చెల్లింపులు జరుపాలని అందులో కుంబ్లే సూచించాడు. 30 శాతం చెల్లింపులను జట్టు ఆటతీరు ప్రాతిపదికగా చెల్లింపులు జరుపాలని సూచించాడు. ఐపీఎల్‌ ఫైనల్‌ (మే 21న) రోజు జరిగిన సమావేశంలో కుంబ్లే సమర్పించిన ప్రతిపాదనల్లో కొన్ని.

కోచ్ జీతాన్ని రూ. 7.5 కోట్లకు పెంచాలి

కోచ్ జీతాన్ని రూ. 7.5 కోట్లకు పెంచాలి

ప్రధాన కోచ్‌ సంవత్సర జీతాన్ని రూ. 6.5 కోట్ల నుంచి రూ. 7.5 కోట్లకు పెంచాలి. కోచ్‌కు కెప్టెన్‌ సంపాదించే మొత్తంలో 60 శాతం వరకు వేతనంగా ఇవ్వాలి. అంతర్జాతీయ టోర్నీల్లో టీమిండియా ప్రదర్శన ఆధారంగా జీతంలో 30 శాతాన్ని బోనస్‌గా పొందేందుకు కోచ్‌ అర్హుడిగా ఉండాలి. దీని ప్రకారం జట్టు సారథికి బీసీసీఐ అధికంగా చెల్లించిన ప్రతిసారీ కోచ్‌ ఆదాయం కూడా పెరుగుతుంది.

బ్యాటింగ్ కోచ్ జీతం రూ. 2.25 కోట్లు

బ్యాటింగ్ కోచ్ జీతం రూ. 2.25 కోట్లు

టీమిండియా సపోర్టింగ్ స్టాఫ్ జీతాలపై కూడా కుంబ్లే నిర్దిష్ట ప్రణాళికతో ఉన్నాడు. బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌ వేతనాన్ని రూ. కోటి నుంచి రూ. 2.25 కోట్లకు.. ఫీల్డింగ్‌ కోచ్‌ వేతనాన్ని రూ. కోటి నుంచి రూ. 1.75 కోట్లకు పెంచాలి.

ఐపీఎల్‌ సమయంలో కాంట్రాక్ట్‌ అమల్లో ఉండదు

ఐపీఎల్‌ సమయంలో కాంట్రాక్ట్‌ అమల్లో ఉండదు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆడే సమయంలో ఆటగాళ్ల కాంట్రాక్ట్‌ అమల్లో ఉండదు. అలాగే కోచ్‌లకు ఐపీఎల్‌ జట్లతో కలిసి పనిచేసే అవకాశమివ్వాలి. దీని వల్ల వారు మరింత ఆదాయం పొందడంతో పాటు టీ20 మ్యాచ్‌ల విషయంలో మరింత అనుభవాన్ని గడిస్తారు.

వరల్డ్ కప్ సాధిస్తే నజరాజాగా 2 కోట్లు

వరల్డ్ కప్ సాధిస్తే నజరాజాగా 2 కోట్లు

భారత జట్టు వన్డే వరల్డ్ కప్‌ని సాధిస్తే ఆటగాళ్లకు రూ. 2 కోట్లు నజరానాగా ఇవ్వాలి. ఛాంపియన్స్‌ ట్రోఫీ, ప్రపంచ టీ20 సాధిస్తే రూ. కోటిని అందజేయాలి. ఇలా కుంబ్లే బోర్డు పాలకుల కమిటీ (సీఓఏ)తో ఆటగాళ్ల జీతాల విషయంలో గట్టిగానే పోరాడాడు. అయినా సరే కుంబ్లే ఆటగాళ్లను చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్నాడని అతడిపై సీఏసీకి ఫిర్యాదు చేయడం, కుంబ్లే-కోహ్లీ విభేదాలతో కోచ్ పదవికి రాజీనామా చేయడం జరిగిపోయాయి.

Story first published: Monday, November 13, 2017, 12:15 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+