కోహ్లీ వద్దు, ధోనిని మళ్లీ కెప్టెన్‌ని చేయండి: హోరెత్తిన ట్వీట్లు
హైదరాబాద్: మోడ్రన్ డే క్రికెట్ దిగ్గజాల్లో విరాట్ కోహ్లీ ఒకడు. సెంచరీల మీద సెంచరీలు చేసి టీమిండియా జట్టు ప్రతిష్టతను పెంచడంలో కీలకపాత్ర పోషించాడు. మూడు పార్మెట్లలో కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కోహ్లీ ఎంతో మందికి రోల్ మోడల్‌గా నిలిచాడు.
కోచ్‌గా తన పద్ధతులపై కెప్టెన్ కోహ్లీకి అభ్యంతరాలున్నట్లుగా బోర్డు తెలిపిన నేపథ్యంలో కుంబ్లే తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కుంబ్లే అహం వల్లే కుంబ్లే తన పదవికి రాజీనామా చేశాడని, మాజీ క్రికెటర్లతో పాటు క్రికెట్ అభిమానులు సైతం కోహ్లీని ఛీ కొడుతున్నారు. సోషల్ మీడియాలో కోహ్లీపై విమర్శల వర్షం కురుస్తోంది.
కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించండి
ఇందులో భాగంగా కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పించాలని కొందరు అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం భారత్ క్రికెట్లో చోటు చేసుకున్న సంక్షోభానికి ముగింపు పలకాలంటే తిరిగి ధోనిని కెప్టెన్‌గా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మైదానం బయటా లోపలా హుందాగా ఉండే ధోనినే కెప్టెన్‌గా కరెక్ట్ అంటున్నారు.
కోహ్లీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ట్వీట్లు
ఇందులో భాగంగా సోషల్ మీడియాలో కోహ్లీకి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు. 'టీమిండియాను సమర్థవంతంగా నడిపించేంత శక్తిసామర్థ్యాలు కోహ్లీకి లేవు. ధోనీ సారథ్యంలో టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచకప్, టీ20 ప్రపంచ కప్ గెలిచింది. ఎంతో విజయవంతమైన కెప్టెన్‌గా పేరున్న ధోనీని తిరిగి టీమిండియా కెప్టెన్ చేయాలి' అని ట్వీట్లు చేస్తున్నారు.
కుంబ్లే రాజీనామాను బీసీసీఐ తిరస్కరించాలి
క్రికెట్ అభిమానులు సోషల్ మీడియాలో కోహ్లీకి వ్యతిరేకంగా, కుంబ్లేకి మద్దతుగా తమ అభిప్రాయాలను తెలియ జేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ నుంచి బాధ్యతలు తీసుకున్న కోహ్లీ తిరిగి అతనికే బాధ్యతలు అప్పగించాలని ఓ అభిమాని కోరగా, కుంబ్లే రాజీనామాను పరిగణలోనికి తీసుకున్న బీసీసీఐ వెంటనే దాన్ని తిరస్కరించి.. ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించాలని అభిమానులు బీసీసీఐని కోరుతున్నారు.
కోచ్ పదవికే వన్నె తెచ్చిన కుంబ్లే
కోచ్‌గా అనిల్ కుంబ్లే ఉన్నది ఏడాది కాలమే అయినప్పటికీ, ఆ పదవికే కుంబ్లే వన్నె తెచ్చాడు. గతేడాది వెస్టిండీస్ పర్యటనతో కోచ్‌గా కుంబ్లే ప్రస్థానం ఆరంభమైన సంగతి తెలిసిందే. అక్కడ టెస్టు సిరీస్‌లో భారత్ 2-0తో విజయం సాధించింది. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్ ఓడింది. కుంబ్లే హయాంలో భారత్ కోల్పోయిన ఏకైక ద్వైపాక్షిక సిరీస్ ఇదే.
ఛాంపియన్స్ ట్రోఫీలో రన్నరప్‌గా నిలిచిన భారత్
ఆ తర్వాత సొంతగడ్డపై భారత్ వరుసగా న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలపై సిరీస్‌లు కైవసం చేసుకుంది. ఇలా స్వదేశంలో ఆడిన టెస్టుల్లో ఒక్కదాంట్లో మాత్రమే ఓడి ఏకంగా 12 టెస్టుల్లో విజయం సాధించింది. టెస్టు ర్యాంకుల్లో నెంబర్ వన్ స్ధానంలో నిలిచింది. కుంబ్లే చివరగా బాధ్యతలు నిర్వర్తించిన ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ రన్నరప్‌గా నిలిచింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications