Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ×కుంబ్లేల మధ్య వివాదం మళ్లీ మీడియాలో..

Anil Kumble-Virat Kohli Feud Akin to CK Nayudu-Vinoo Mankad Skirmish Of 1952: Ramachandran Guha

హైదరాబాద్ : టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ గతంలో భారత జట్టుకు కోచ్ గా వ్యవహరించిన అనిల్ కుంబ్లేల మధ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. బీసీసీఐ పాలకుల కమిటీ మాజీ సభ్యుడు రామచంద్ర గుహ ఎప్పుడూ చెప్పని భావాలను బయటపెట్టాడు. కోహ్లీ, కుంబ్లేల వివాదాన్ని 1952లో జరిగిన సీకే నాయుడు, వినూ మన్కడ్‌ వివాదంతో పోల్చి చెప్పాడు. ముంబైలోని జింఖానా మైదానంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఆ గొడవ జరిగినప్పుడు సీకే నాయుడు సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా ఉన్నారని అన్నారు. తాను క్రికెట్‌ పాలకుల కమిటీకి ఆర్నెల్ల క్రితమే రాజీనామా చేసినట్లు గుర్తు చేశారు. ఆ తర్వాత క్రికెట్‌పై బహిరంగంగా మాట్లాడటం ఇదే తొలిసారంటూ మొదలుపెట్టారు.

Anil Kumble-Virat Kohli Feud Akin to CK Nayudu-Vinoo Mankad Skirmish Of 1952: Ramachandran Guha

1952 సంవత్సరంలో కల్నల్‌ సీకే నాయుడు, వినూ మన్కడ్‌ మధ్య ఇలాంటి వివాదమే చోటు చేసుకుందన్నారు. అప్పట్లో సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా సీకే నాయుడు ఉండేవారన్నారు. వినూ మన్కడ్‌ భారత అద్భుత క్రికెటర్‌. ఆ సమయంలో మంచి ఫామ్‌లో ఉన్న ఆటగాడు. 1952లో భారత్‌కు ఇంగ్లాండ్‌లో పర్యటించాల్సి వచ్చింది.

క్రీడాకారుడు మన్కడ్‌కు లంకాషైర్‌ నుంచి ఓ అగ్రిమెంట్ ప్రపోజల్ వచ్చిందట. దానిని ప్రస్తావిస్తూ జట్టులోకి తీసుకుంటారని తనకు హామీ ఇస్తే లంకషైర్‌తో ఒప్పందం కుదుర్చుకోనని బీసీసీఐకి తెలిపినట్లు ఆయన ప్రస్తావించారు. దానికి బదులిచ్చిన బీసీసీఐ తామెలాంటి హామీ ఇవ్వలేమంటూ చెప్పిందన్నారు.

"భారత్‌ లార్డ్స్‌లో జరిగిన తొలి టెస్టులో ఓడింది. మన్కడ్‌ ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 72, రెండో ఇన్నింగ్స్‌లో 184 పరుగులు చేశాడు. బంతితోనూ రాణించి తొలి ఇన్నింగ్స్‌లో 5/196 గణాంకాలు నమోదు చేశాడు. 1952లో సీకే నాయుడు, మన్కడ్‌కు మధ్య ఉన్న సంబంధమే ఇప్పుడు విరాట్‌ కోహ్లీ, అనిల్‌ కుంబ్లే మధ్య కనిపించింది" అని గుహ చెప్పారు.

అప్పట్లో ఆటగాళ్లపై పాలకుల ఆధిపత్యం ఉండేదని మన్కడ్‌ ఓ సారి చెప్పారు. 1952లో ఆటగాళ్లపై పాలకులు, సెలక్టర్లు, మేనేజర్లదే పైచేయిగా ఉంటే ఇప్పుడంతా రివర్స్ అయిందని రామచంద్ర గుహ గుర్తు చేసుకున్నారు.

తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్‌బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్‌లో ఫాలో అవ్వండి.

Story first published: Saturday, December 16, 2017, 14:42 [IST]
Other articles published on Dec 16, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+