For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

46వ పడిలోకి కుంబ్లే: 'జంబో' అనే పేరు ఎవరు పెట్టారు?

By Nageshwara Rao

న్యూఢిల్లీ: టీమిండియా దిగ్గజ స్పిన్నర్‌, మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే సోమవారం (అక్టోబర్ 17)న 46వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. వివాదాలకు ఆమడ దూరంలో ఉండే వ్యక్తిగా పేరుగాంచాడు.

జట్టు సహచర ఆటగాళ్లు ముద్దుగా 'ద జంబో' అని పిలుచుకునే కుంబ్లే టీమిండియాకు అటు టెస్టుల్లో, ఇటు వన్డేల్లో చిరస్మరణీయ విజయాలను కట్టబెట్టాడు. పాకిస్థాన్‌పై ఒకే మ్యాచ్‌లో పదికి పది వికెట్లు తీశాడు. భారతీయ బౌలర్లలో ఈ ఘనతను సాధించిన ఏకైక బౌలర్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇక ప్రపంచ క్రికెట్లో రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం టీమిండియా ఛీప్ సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టి జట్టును నడిపిస్తున్నారు. కుంబ్లే పుట్టిన రోజు సందర్భంగా సచిన్‌ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్‌, మహ్మద్‌ కైఫ్‌, అజిత్‌ అగార్కర్‌, విరాట్‌ కోహ్లి, అశ్విన్‌, పార్థీవ్‌ పటేల్‌ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

 బెంగళూరులో జననం

బెంగళూరులో జననం

కర్ణాటకకు చెందిన అనిల్ కుంబ్లే 1970, అక్టోబరు 17న బెంగళూరులో జన్మించాడు. 1990లో అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగ్రేటం చేశాడు. అనతికాలంలోనే జట్టులో కీలక స్పిన్నర్‌గా ఎదిగిన కుంబ్లే కెరీర్‌లో టీమిండియాను ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో గెలిపించాడు.

132 టెస్టు మ్యాచ్‌లాడి 619 వికెట్లు

132 టెస్టు మ్యాచ్‌లాడి 619 వికెట్లు

18 ఏళ్ల తన క్రీడా జీవితంలో మొత్తం 132 టెస్టు మ్యాచ్‌లాడి 619 వికెట్లు తీశాడు. ఇక 271 వన్డేల్లో 337 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీసిన బౌలర్లు ఇద్దరే ఇద్దరు. అందులో ఒకర కుంబ్లే కాగా మరొకరు ఇంగ్లాండ్‌ స్పిన్నర్‌ జిమ్‌ లేకర్‌.

పది వికెట్లు తీసుకున్న రెండు బౌలర్

పది వికెట్లు తీసుకున్న రెండు బౌలర్

పాకిస్థాన్‌తో 1999లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో కుంబ్లే 74 పరుగులిచ్చి ఏకంగా పది వికెట్లు పడగొట్టాడు. 18ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌కు 2008లో వీడ్కోలు పలికాడు. 19ఏళ్ల వయసులోనే 1990లో మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. రంజీల్లో కూడా తనదైన శైలిలో సత్తా చాటాడు. ఢిల్లీలో జరిగిన ఇరానీ ట్రోఫీలో 13 వికెట్లు తీసుకుని 138 పరుగులిచ్చాడు. దీంతో అతడిని సెలక్టర్లు దక్షిణాప్రికా పర్యటనకు ఎంపిక చేశారు. కుంబ్లే టాలెంట్ ఉన్న ఆటగాడు మాత్రమే కాదు, చదువులో కూడా టాపరే.

 మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా

మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా

ఇండియాలో ఉన్న క్వాలిఫైడ్ క్రికెటర్లలో ఒకరు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పొందారు. అంతేకాదు 500కు పైగా వికెట్లు తీసుకుని 2000కు పైగా పరుగులు చేసిన రెండో బౌలర్. ఆస్ట్రేలియా క్రికెటర్ షేన్ వార్న్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో 500కు పైగా వికెట్లు తీసుకుని 2000కు పైగా పరుగులు చేశాడు. 132 టెస్టుల్లో 619 వికెట్లను కుంబ్లే తీసుకున్నాడు.

'జంబో' అనే ముద్దు పేరు ఎవరు పెట్టారు?

'జంబో' అనే ముద్దు పేరు ఎవరు పెట్టారు?

కుంబ్లేని టీమిండియా ఆటగాళ్లు ముద్దుగా 'ద జంబో' అని పిలుస్తుంటారు. తనకు జంబో అని ఎవరు పేరు పెట్టారో అనే విషయాన్ని ఫ్యాన్స్‌తో ట్విట్టర్‌లో చాటింగ్ చేసిన సందర్భంలో కుంబ్లే పంచుకున్నారు. ఇరానీ ట్రోఫీలో ఆడుతున్న సమయంలో టీమిండియా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ తనకు ఆ పేరు పెట్టారని వెల్లడించారు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+