Anil Kumble: పాకిస్థాన్‌పై ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు.. కుంబ్లే విధ్వంసానికి నేటికి 23 ఏళ్లు!

టీమిండియా స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి చరిత్ర సృష్టించాడు. ఢిల్లీ వేదికగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై కుంబ్లే సృష్టించిన ఆ విధ్వంసానికి నేటికి సరిగ్గా 23 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో ఆ మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ట్విట్టర్‌లో బీసీసీఐ ఓ పోస్ట్ చేసింది. ఆ పోస్ట్‌లో కుంబ్లే పడగొట్టిన 10 వికెట్లకు సంబంధించిన ఓ వీడియోను అప్‌లోడ్ చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ సందర్భంగా ఆ రోజుకు సంబంధించిన మధుర జ్ఞాపకాలను ఒక సారి నెమరు వేసుకుందాం.
ఢిల్లీ వేదికగా చరిత్ర ఆవిష్కృతం
1999లో ఢిల్లీ వేదికగా భారత్, పాకిస్థాన్ మధ్య టెస్టు మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో భారత్ విసిరిన 420 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ ఆరంభంలో బాగానే ఆడింది. వికెట్ కోల్పోకుండా 101 పరుగులు చేసింది. కానీ అక్కడి నుంచే కుంబ్లే తన ప్రతాపాన్ని చూపెట్టాడు. వరుస పెట్టి వికెట్లు పడగొడుతూ పాకిస్థాన్ బ్యాటర్లను బెంబెలేత్తించాడు. కుంబ్లే విసిరిన గిర్రున తిరిగే బంతులకు పాకిస్థాన్ ఆటగాళ్ల దగ్గర సమాధానమే లేకపోయింది. దీంతో చూస్తుండగానే పాకిస్థాన్ మొత్తం టీంను కుంబ్లే ఒక్కడే ఆల్‌ట్ చేశాడు.

మొత్తంగా 14 వికెట్లు
101-0 తో పటిష్ట స్థితిలో ఉన్న పాకిస్థాన్ కుంబ్లే దెబ్బకు 207 పరుగులకే కుప్పుకూలింది. మొత్తం ఈ ఇన్నింగ్స్‌లో 26.3 ఓవర్లు బౌలింగ్ వేసిన కుంబ్లే 74 పరుగులు ఇచ్చి 10 వికెట్లు తీశాడు. కుంబ్లే సంచలన ఇన్నింగ్స్‌తో ఆ మ్యాచ్‌లో టీమిండియా 212 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో తీసిన 4 వికెట్లతో కలిపి మ్యాచ్ మొత్తంలో 14 వికెట్లు పడగొట్టిన అనిల్‌కుంబ్లేకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కుంబ్లే ఈ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌కు ఢిల్లీలోని ఫిరోజ్‌కోట్ల మైదానం వేదికగా నిలిచింది. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ తాజాగా ట్విట్టర్‌లో పోస్ట్ చేయగా నెట్టింట వైరల్ మారింది. కాగా 10 వికెట్లు తీసిన ఏకైక భారత బౌలర్‌గా ఇప్పటివరకు ఆ రికార్డు కుంబ్లే పేరు మీదనే ఉంది.

మ్యాచ్ వివరాలు
పాకిస్థాన్‌తో జరిగిన ఆ టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా మొదట బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ రమేష్, కెప్టెన్ అజారుద్దీన్ హాఫ్ సెంచరీలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్థాన్ 172 పరుగులకు ఆలౌటైంది. కుంబ్లే 4, భజ్జీ 3 వికెట్లు తీశారు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 339 పరుగులు చేసింది. ఓపెనర్ రమేష్ 96 పరుగులు చేసి తృటిలో శతకం చేజర్జుకున్నాడు. గంగూలీ హాఫ్ సెంచరీతో రాణించాడు. ఇక 420 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్ కుంబ్లే ధాటికి 207 పరుగులకే ఆలౌటైంది. దీంతో టీమిండియా 212 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications